AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది.. వరుణ్ తేజ్ మాస్ స్టెప్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. కామెడీ యాక్షన్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘కంసంనిద’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది.

Korean Kanakaraju:  'కొరియన్ కనకరాజు' సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది.. వరుణ్ తేజ్ మాస్ స్టెప్స్
Korean Kanakaraju Movie
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 8:34 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాటను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఎస్. థమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది. నల్గొండ గద్దర్ గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక ఈ పాటలో వరుణ్ తేజ్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కనిపించారు. ఆయన మాసీ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. దక్ష నగార్కర్ గ్లామరస్ ప్రెజెన్స్, వరుణ్ తేజ్‌తో ఆమె కెమిస్ట్రీ ఈ లిరికల్ వీడియోలో హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ‘‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను. పెదనాన్న గారిని దృష్టిలో పెట్టుకుని డ్యాన్స్ చేశాను. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలని ఉంది. కానీ కాలికి గాయం ఇంకా తగ్గలేదు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. ఆగస్ట్ 7న సినిమా రాబోతోంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని భావిస్తున్నాను. షూటింగ్ టైంలో మాకు సపోర్ట్ చేసిన భవానీ గారికి, వరుణ్ గారికి థాంక్స్. కాలి గాయం వల్ల చాలా రోజులు బయటకు రాలేదు. ఇప్పుడు ఇలా మీ అందరినీ చూస్తుండటం ఆనందంగా ఉంది. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ .. ‘‘కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ పాటను అనంతపూర్‌లో రిలీజ్ చేయాలని వరుణ్ గారు చెప్పారు. ఇక్కడి బ్యాక్ డ్రాప్‌తోనే ఈ మూవీని చేస్తున్నాం. డబ్బింగ్ అద్భుతంగా జరుగుతోంది. వరుణ్ గారు డ్యాన్స్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. షూటింగ్ టైంలో మాకు సపోర్ట్ చేసిన పాండు గారికి థాంక్స్. ఆగస్ట్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘వరుణ్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మా ‘కొరియన్ కనకరాజు’కి థమన్ సంగీతం బిగ్గెస్ట్ అస్సెట్‌ అవుతారు. మా చిత్రం ఆగస్ట్ 7న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతపూర్ ఉడా చైర్మన్ వరుణ్ మాట్లాడుతూ .. ‘వరుణ్ తేజ్ అన్న మంచి వ్యక్తి. ఆయన మంచితనమే గొప్ప స్థాయికి తీసుకు వెళ్తుంది. టాలీవుడ్‌లో హాలీవుడ్ కటౌట్ ఉన్న వ్యక్తి మన అన్న వరుణ్ గారు. మన ఊరు బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది’ అని అన్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఏపీ ప్రెసిడెంట్ భవానీ రవి శంకర్ మాట్లాడుతూ .. ‘వరుణ్ తేజ్ గారి కెరీర్‌లో ‘కొరియన్ కనకరాజు’ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, సత్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని కెమెరామెన్‌గా, సత్య జి. ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

‘రాసా గుమ్మాడి’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us