AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ‘కాకినాడను కుదిపేసిన హత్య’.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు

ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవారికి ఈ తెలుగు మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ ఉంది.

OTT Movie: 'కాకినాడను కుదిపేసిన హత్య'.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 17, 2026 | 7:26 PM

Share

ఎప్పటిలాగే ఓటీటీల్లోకి ఈ వారం చాలా సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. సమంత ‘మా ఇంటి బంగారం’, సాయిపల్లవి ‘ఏక్ దిన్’, వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’, దర్శన్ ‘ద డెవిల్’తో వంటి సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగానే ఆడింది. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర బాగా హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఏపీలోని కాకినాడ నేపథ్యంలో సాగుతుంది. ఆ ప్రాంతంలో భగవంత్ రాజు ఓ పేరు మోసిన రౌడీ షీటర్. రాజకీయంగానూ బలపడాలని కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుక రెడీ అవుతాడు.అయితే, అదే సీటు కోసం దుర్గ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తాడు. ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంటుంది. అయితే ఒక రోజు రాత్రి భగవంత్ రాజు దారుణ హత్యకు గురువుతాడు. దీంతో ప్రత్యర్తులపై అనుమానం మొదలవుతుంది? మరి ఆ హత్య వెనక ఉన్న ప్రధాన సూత్రధారులెవరు? ఎవరు అతనిని హత్య చేశారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథ సింపుల్ గా ఉన్న ఇందులోని ట్విస్టులు ఆడియెన్స్ కు మతిపోగొడుతాయి. అలాగే స్క్రీన్ ప్లే, బీజీఎమ్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రముఖ సింగర్ రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు గేదెల రాజు.. కాకినాడ తాలుకా. ‘చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు’ అన్నది ఈ సినిమా క్యాప్షన్. చైతన్య మోటూరి తెరకెక్కించిన ఈ సినిమాలో రఘు కుంచెతో పాటు వికాస్ ముప్పాల, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

గేదెల రాజు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!