AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: గ్రేట్ సార్.. మీ మీద గౌరవం ఇంకా పెరిగింది.. ఆ చిన్నారి తల్లికి అండగా నిలిచిన అనిల్ రావిపూడి

ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకైన అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిపోయాడు. ది గ్రేట్ రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు ఒక గొప్ప పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

Anil Ravipudi: గ్రేట్ సార్.. మీ మీద గౌరవం ఇంకా పెరిగింది.. ఆ చిన్నారి తల్లికి అండగా నిలిచిన అనిల్ రావిపూడి
Director Anil Ravipudi
Basha Shek
|

Updated on: Jul 17, 2026 | 9:01 PM

Share

డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాదికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారాయన. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం మరో క్రేజీ మల్టీ స్టారర్ తో మన ముందుకు వస్తున్నారు అనిల్. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. కాగా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడీ డైరెక్టర్. ఒక ప్రముఖ చానెల్ లో వస్తోన్న డ్రామా జూనియర్స్ సీజన్ 9 కు రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు రోజా, హీరో శ్రీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడిని తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలిస్తూ శ్రీవియా అనే చిన్నారి సరదాగా అందరినీ ఆటపట్టిస్తూ నవ్విస్తూ ఉంటుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మాత్రం శ్రీవియా చాలా బాధతో కనిపించింది. ఇందుకు గల కారణాన్ని సుధీర్ బయట పెట్టాడు. శ్రీవియా తల్లి షూటింగ్ కి రాలేదని, ఇటీవల యాక్సిడెంట్ కి గురైందని, రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయని అసలు విషయం చెప్పుకొచ్చాడు సుధీర్.

సుధీర్ మాటలకు అనిల్ రావిపూడి కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. శ్రీవియా తల్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చును భరించినట్లు తెలిపాడు. ఈ విషయం చెప్పగానే స్టేజ్ పైనే ఏడ్చేసింది శ్రీవియా. ఇదే సందర్భంగా చిన్నారి తల్లి వీడియో మెసేజ్ ని కూడా ప్లే చేయగా ఆమె అనిల్ రావిపూడి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి చాలా మంచి పనిచేశారంటూ సినీ అభిమానులు, నెటిజన్లు ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం
కేతు సంచారం.. వీరికి తల రాత మారడం ఖాయం
బలహీనంగా అనిపిస్తోందా? ఉదయాన్నే ఇవి తినండి!
బలహీనంగా అనిపిస్తోందా? ఉదయాన్నే ఇవి తినండి!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్.. గోడలు దూకి చోరీకి యత్నం!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో అప్డేట్..
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
ఒక్క తప్పుతో చేజారిన సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ షాట్ వైరల్
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
7.8 శాతం జీడీపీ వృద్ధి.. ప్రధాని మోదీ విధానాలతోనే సాధ్యమైంది!
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
32 మంది ప్రయాణికులతో వస్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? బర్త్‌డే ఫొటోస్ వైరల్