AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఇతనే.. 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా..

హీరోలైనా, హీరోయిన్లైనా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించాలంటే ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిందే. అలాగే గ్లామర్ కూడా మెయింటైన్ చేయాల్సిందే. డైటింగ్ లో భాగంగా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోక తప్పదు. అయితే ఈ టాలీవుడ్ హీరో మాత్రం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయడట.

Tollywood: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డైటింగ్ చేయని ఏకైక తెలుగు హీరో ఇతనే.. 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 6:54 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించాలంటే ఫిట్ గా ఉండాల్సిందే. అలాగే గ్లామర్ కూడా మెయింటైన్ చేయాల్సిందే. అందుకే సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నటీనటులందరూ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మనసుకు నచ్చిన ఫుడ్ కళ్లముందున్నా కడుపు మాడ్చుకుంటుంటారు. ఇక డ్రింకింగ్, స్మోకింగ్ వంటి వ్యసనాలకు కూడా దూరంగా ఉంటారు. అలాగే గంటల తరబడి కష్టమైన వర్కవుట్స్ చేస్తూ చెమటోడుస్తుంటారు. అయితే ఒక తెలుగు హీరో మాత్రం అసలు డైటింగ్ చేయడట. నచ్చిన ఫుడ్ లాగించేస్తాడట. అయినా 60 ఏళ్లకు దగ్గరవుతున్నా ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నాడట. ఇటీవలో ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు శ్రీకాంత్. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించారాయన. ఇప్పటివరకు దాదాపు 130 సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. లయ మరో కీలక పాత్రలో నటిస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్.. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ చక్కటి బూర బుగ్గలు.. నాకు తెలిసి ఇండియాలో డైటింగ్ చేయని ఏకైక హీరో నువ్వు.. చక్కగా అన్నీ తింటాడు. జెనెటికల్ గా ఎప్పుడూ నవ్వుతూ, హ్యాపీగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చారు వీవీ వినాయక్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

శ్రీకాంత్ గ్లామర్ సీక్రెట్ ఇదే..

ఇక శ్రీకాంత్ గ్లామర్ సీక్రెట్ విషయానికి వస్తే. ఆయన బయట పెద్దగా తినడు. ఎక్కువగా హోమ్లీ ఫుడ్ కే ప్రాధాన్యం ఇస్తాడు. బిర్యానీలు వంటి వంటకాలను ఇష్టంగా లాగించేస్తాడు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆయనకు అలవాటు. అలాగే బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి గేమ్స్ బాగా ఆడుతంటారు. అందుకే 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా కనిపిస్తుంటారీ సీనియర్ హీరో.

హీరో శ్రీకాంత్ గురించి వినాయక్ మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us