AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master: పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్నేహితులు వెంటనే పండును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. డాక్టర్లు అతనికి అన్నీ పరీక్షలు చేసి సర్జరీ కూడా నిర్వహించారు.

Pandu Master: పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు
Pandu Master, Anchor Suma
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 4:16 PM

Share

తన డ్యాన్స్‌లు, కామెడీతో గిలిగింతలు పెట్టే పండు మాస్టర్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం బారిన పడడం అతని అభిమానులతో పాటు అందరినీ కలిచి వేసింది. అందులోనూ సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం మరింత వేధనకు గురి చేసింది. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్ ను వేగంగా వచ్చిన ఒక వ్యాన్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు ఇక మొన్నటివరకు ఆస్పత్రిలోనే ఉన్న పండు మాస్టర్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. తన నివాసంలోనే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. రీసెంట్ గానే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పండు మాస్టర్ ఇంటికెళ్ల అతనిని కలిశారు. పండుకు ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. తాజాగా యాంకర్ సుమ పండు మాస్టర్ ను పరామర్శించింది. వీడియో కాల్ చేసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంది. జాగ్రత్తలతో పాటు ధైర్యగా ఉండాలని భరోసా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా పండు మాస్టరే సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

‘ సుమ మేడం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శేఖర్ మాస్టర్ గారు వచ్చిన సమయంలో, పండు మాస్టర్ గారి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా ఆలోచించి, స్వయంగా వీడియో కాల్ చేసి ఆయన బాగోగులు అడిగి తెలుసుకోవడం నిజంగా ఎంతో హృద్యంగా అనిపించింది. ఆ క్షణం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.అలాగే, “నువ్వు నా మీద రాసిన సాంగ్ చాలా అద్భుతంగా ఉంది” అని మీరు చెప్పడం, మళ్లీ త్వరలో మరో మంచి పాట రాసి, అందమైన డాన్స్‌తో మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని మీరు కోరడం మా కోసం గొప్ప ప్రోత్సాహం. దీనికి పండు మాస్టర్ గారు కూడా పాజిటివ్‌గా స్పందించడం మాకు మరింత ఆనందాన్ని కలిగించింది. మీ లాంటి గొప్ప వ్యక్తులు మాలాంటి డాన్స్ మాస్టర్స్‌కి, డాన్సర్స్‌కి ఎప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…ధన్యవాదాలు సుమ మేడం గారు అండ్ శేఖర్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తన పోస్టులో రాసుకొచ్చాడు పండు మాస్టర్. కాగా మొన్నటివరకు ఆస్పత్రి బెడ్ పై కదల్లేని స్థితిలో ఉన్న పండు మాస్టర్ త్వరగా కోలుకుంటున్నారు. గతంలోలా మళ్లీ ఎంతో సరదాగా, ఫన్నీగా మాట్లాడుతున్నాడు. దీంతో అతని అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక పండు మాస్టర్ ను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాము చెప్పిన సమయం కంటే త్వరగానే మాస్టర్ కోలుకుంటున్నాడని, త్వరలోనే అతను సాధారణ స్థితికి చేరుకుంటాడని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us