The Odyssey Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’.. రెండు రోజుల్లోనే ఏకంగా అన్ని కోట్లా?
అనుకున్నట్లుగానే క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఇండియాలోనూ ఈ హాలీవుడ్ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కు బ్రహ్మరథం పడుతుండడం విశేషం.

ప్రముఖ హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మరో విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’. రిలీజ్ కు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ గత శుక్రవారం (జూలై 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఇటు ఇండియాలో, అటు వరల్డ్ వైడ్ గానూ ‘ది ఒడిస్సీ’ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు ఇండియాలో ఈ సినిమాకు సుమారు రూ. 17.40 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే వీకెండ్ కావడంతో శనివారం (జులై 18) క్రిస్టోఫర్ నోలన్ సినిమా వసూళ్లు భారీగా పెరిగాయి. రెండో రోజు ఈ సినిమాకు ఏకంగా రూ. 22 కోట్లు వచ్చాయి. మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమాకు సుమారు రూ. 39.40 కోట్ల షేర్ (రూ. 47.03 కోట్ల గ్రాస్) కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వెర్షన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే.. ‘ది ఒడిస్సీ’ సినిమా నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. మొదటి రోజే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ విజువల్ వండర్ రెండో రోజు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 257.8 మిలియన్ల డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2,150 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆదివారం కూడా సెలవు దినం కావడంతో ఈ నంబర్లు మరింత పెరగనున్నాయని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ది ఒడిస్సీ సినిమా విషయానికి వస్తే.. హోమర్ రాసిన ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టోఫర్ నోలన్. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, జెండాయా, లుపితా న్యోంగో తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ సుమారు రూ. 2000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
ది ఒడిస్సీ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




