AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి రమ్మని 4,5 ఏళ్లుగా కాల్స్ వస్తున్నాయి.. కానీ.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు, యూట్యూబర్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇక ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10:  బిగ్‌బాస్‌లోకి రమ్మని 4,5 ఏళ్లుగా కాల్స్ వస్తున్నాయి.. కానీ.. ప్రముఖ నటి  కామెంట్స్ వైరల్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 7:50 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం.. ఇలా ప్రధాన భాషల్లోనూ ఈ రియాలిటీ షురూ కానుంది. ఇక తెలుగులో ఈసారి ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో నిర్వాహకులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి రియాలిటీ షోలో చాలా మార్పులు చేయనున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు,గేమ్స్, టాస్కుల నిర్వహణలోనూ కొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ పదో సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే కంటెస్టెంట్ల జాబితాపై ఒక పెద్ద చర్చే జరుగుతోంది. బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్ల తో పాటు సామాన్యులు కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అగ్ని పరీక్ష ఆడియెన్స్ కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ షోకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ రియాలిటీ షోపై లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడంపై కుండ బద్దలు కొట్టేసింది.

‘నేను నాన్ కాంట్రవర్సీ రియాల్టీ షోల్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పటికే మూడు నాలుగు షోలు చేశాను. కానీ బిగ్ బాస్ లో చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నాలుగైదు ఏళ్లుగా బిగ్ బాస్ కి పిలుస్తున్నారు. తమిళ్, తెలుగులో రెండు చోట్లా రమ్మని పిలుస్తున్నారు. కానీ నాకు ఈ రియాలిటీ షోలోకి వెళ్లడం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే 24 గంటల్లో జరుగుతూ ఉన్న విషయాల్ని మీరు ఒక గంటలో ఎలా చూపిస్తారు. అంటే అక్కడ చాలా ఎడిటింగ్ ఉంటుంది. వాళ్లకు నచ్చినట్టు మన మాటల్ని కట్ చేసి ఆడియెన్స్ కు చూపిస్తారు. అది జనాలు నమ్మి కంటెస్టెంట్లను ట్రోలింగ్ చేస్తారు. అది నాకు అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న గుడ్ వైబ్స్ చాలు. కాంట్రవర్సీ లోకి వెళ్లడానికి ఇప్పుడు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. మరీ ముఖ్యంగా అలాంటి ట్రోల్స్ ను ఫేస్ చేయడానికి అంత మెంటల్ స్ట్రెంగ్త్ నా దగ్గర లేదు. నేను మాట్లాడింది ఏదైనా తప్పుగా అర్ధం చేసుకొని అది నెగిటివ్ అయితే నేను హ్యాండిల్ చేయలేను. అలా హ్యాండిల్ చేసే వాళ్లు ఉన్నారని కూడా తెలిసింది. అలాంటి వాళ్లు నిజంగా గ్రేట్’ అని చెప్పుకొచ్చింది విద్యుల్లేఖా రామన్. అంటే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా చేయను అని చెప్పేసినట్టు క్లారిటీ ఇచ్చేసిందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

విద్యుల్లేఖా రామన్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us