AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Satya Sri: విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ సత్యశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ షోలో కమెడియన్ గా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిందీ అందాల తార. ఇప్పుడీ ముద్దుగుమ్మ సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా తన చెల్లి గురించి చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సత్యశ్రీ.

Jabardasth Satya Sri: విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
Jabardasth Satya Sri
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 7:07 PM

Share

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యశ్రీ ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ రికార్డు వ్యూస్ తెచ్చుకున్నాయి. అయితే చమ్మక్ చంద్ర ఈ షోను విడిచిన కొద్ది కాలానికే సత్యశ్రీ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. అయితే సత్యశ్రీ ఒక చెల్లి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే తాజాగా తన చెల్లి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది సత్యశ్రీ. అదేంటంటే.. తన చెల్లెలు ఒక ఏవియానిక్స్ ఇంజనీర్ అని, రీసెంట్ గా విజయవంతమైన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలోనూ ఆమె పాలుపంచుకుందని సత్యశ్రీ తెలిపింది.ఈ మేరకు తన చెల్లి కీర్తి శ్రీ ఏరోస్పేస్ సెంటర్ లో, ఆ ప్రయోగానికి సంబంధించిన వర్క్ చేస్తున్నప్పుడు దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సత్యశ్రీ. అలాగే తన చెల్లిని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది.

‘ ఈ ప్రయోగం కౌంట్‌డౌన్‌కు ముందు, లెక్కలేనన్ని గంటలపాటు పరీక్షలు జరిగాయి. ఈ ప్రయోగంలో భాగమైన ప్రతి ఒక్కరిలోనూ ఎంతో అంకిత భావం కనిపించింది. స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి, విక్రమ్-1 సిబ్బంది అందరికీ, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. మీ అభిరుచి, ఆవిష్కరణ, సమష్టి కృషి కలలను నిజం చేశాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో భాగమైన ఇంజనీర్లలో నా చిన్నారి యువరాణి, నా సోదరి కీర్తి శ్రీ కూడా ఉన్నారు. ఆమె విక్రమ్-1 కోసం ఏవియానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ & టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఆమె పనిచేసిన తీరు మిషన్ ఆగమనం ( విక్రమ్-1 రాకెట్ )ను ఆకాశానికి మరింత చేరువ చేశాయి.

ఇవి కూడా చదవండి

విక్రమ్- రాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్య శ్రీ చెల్లెలు..

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

‘ ఈ రోజు నేను కేవలం ఒక రాకెట్‌ను మాత్రమే చూడడం లేదు. నేను ఆమె అంకితభావాన్ని, ఆమె కలలను, ఆమె ప్రయాణం గాల్లోకి ఎగరడాన్ని చూస్తున్నాను. కీర్తిశ్రీ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మిషన్ ఆగమన్‌ను ఒక చారిత్రాత్మక ఘట్టం. నా సోదరి విక్రమ్-1 ‘ఆగమన్’ రాకెట్‌పై తన పేరును సంతకం చేస్తుంటే నా హృదయం ఎంతో గర్వంతో నిండిపోయింది. ఇది మరెన్నో మైలురాళ్లకు నాంది కావాలని ఆశిస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సత్య శ్రీ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సత్యశ్రీ సోదరికి అభినందనలు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

సోదరితో జబర్దస్త్ సత్య శ్రీ..

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us