AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారుక్ ఖాన్‌ సీరియస్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు 48 గంటల డెడ్‌లైన్.. అసలు ఏం జరిగిందంటే

బాలీవుడ్ బాద్ షా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకున్నారు షారుఖ్ ఖాన్. ఆయనకు అభిమానులు కాదు.. వీరాభిమానులు ఉంటారు. ఇక షారుఖ్ సైతం అభిమానుల పట్ల చూపించే ప్రేమ తెలిసిందే.

షారుక్ ఖాన్‌ సీరియస్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు 48 గంటల డెడ్‌లైన్.. అసలు ఏం జరిగిందంటే
Srk
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2026 | 9:28 AM

Share

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమాతో కాకుండా ఓ సోషల్ మీడియా వివాదంతో చర్చనీయాంశంగా మారారు. ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో షారుక్ ఖాన్ మాట్లాడిన ఓ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమైన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సువిగ్య శర్మ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ రీల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ వీడియోలోని వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని షారుక్ ఖాన్ లీగల్ టీమ్ పేర్కొంది. అంతేకాదు, తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని 48 గంటల గడువు విధించింది. ఇంతకీ ఈ వివాదం వెనుక అసలు కథేంటి? ఇన్‌ఫ్లుయెన్సర్‌కు షారుక్ పంపిన నోటీసులో ఏముంది? ఇటీవల ముంబైలో జరిగిన గ్లోబల్ పీస్ ఆనర్స్ 2026 కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, వ్యాపారవేత్త అనంత్ అంబానీ, ఆధ్యాత్మిక గురువు సద్గురు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ, సద్గురుతో మాట్లాడుతున్న సమయంలో షారుక్ ఖాన్‌తో జరిగిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ వీడియోను షేర్ చేసిన సువిగ్య శర్మ.. అనంత్ అంబానీ షారుక్ ఖాన్‌ను సైలెంట్ గా ఉండాలని సూచించినట్లుగా తన రీల్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు పూర్తి సందర్భం తెలియకుండా వీడియోకు తప్పుడు అర్థాలు ఆపాదిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై స్పందించిన షారుక్ ఖాన్ లీగల్ టీమ్.. సువిగ్య శర్మ చేసిన ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నవంబర్ 23న పంపిన లీగల్ నోటీసులో ఆ రీల్‌లోని వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ ద్వారా అసలు సందర్భాన్ని వక్రీకరించి, నటుడి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది.

ఈ క్రమంలో భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 356ను కూడా నోటీసులో ప్రస్తావించింది. ఇది పరువునష్టంకు సంబంధించిన నిబంధన. ఆధారాలు లేకుండా వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగించే వ్యాఖ్యలను ప్రచారం చేయడంపై న్యాయపరమైన అభ్యంతరాలను వెల్లడించింది. మరోవైపు లీగల్ నోటీసు అందుకున్న సువిగ్య శర్మ కూడా వెనక్కి తగ్గలేదు. తన రెండో వీడియోలో షారుక్ ఖాన్ అభ్యంతరాన్ని ప్రశ్నిస్తూ స్పందించాడు. ఈ వ్యవహారం భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వాదించాడు. అంతేకాదు.. “షారుక్ ఖాన్‌ను మౌనంగా ఉండమని చెప్పిన వ్యక్తి ఆయనను అవమానించలేదా.? లేదా అవమానించారని చెప్పే ధైర్యం షారుక్‌కు లేదా? కానీ మేము మాత్రం ఆయనను అవమానించినట్లు చెబుతున్నారు” అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
షారుక్ ఖాన్‌ సీరియస్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు 48 గంటల డెడ్‌లైన్
షారుక్ ఖాన్‌ సీరియస్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు 48 గంటల డెడ్‌లైన్
IIT రోబోటిక్స్‌, ఫిజికల్‌ ఏఐ, స్పేస్‌ టెక్నాలజీలో 6 వేల సీట్లు!
IIT రోబోటిక్స్‌, ఫిజికల్‌ ఏఐ, స్పేస్‌ టెక్నాలజీలో 6 వేల సీట్లు!
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో 'రామాయణ' మరో ముందడుగు
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో 'రామాయణ' మరో ముందడుగు
JEE మెయిన్‌ 2027 తొలి విడతకు 15 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు..
JEE మెయిన్‌ 2027 తొలి విడతకు 15 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు..
రన్నింగ్‌లో ఉండగా మంటలు.. క్షణాల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
రన్నింగ్‌లో ఉండగా మంటలు.. క్షణాల్లో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు..
రూ. 2 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్లు..
ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్.. ఐపీఎల్ వేలంలో ఈ వింత చూశారా?
ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్.. ఐపీఎల్ వేలంలో ఈ వింత చూశారా?
గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి
గాజు గ్లాసులు, గిన్నెలు తళతళ మెరవాలంటే.. ఈ 4 చిట్కాలు తెలుసుకోండి
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
మరో సర్‌ప్రైజింగ్ లుక్‌లో సాయి పల్లవి.. కొత్త సినిమా పాట చూశారా?
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
2 రోజుల్లోనే తెలంగాణ SI పరీక్ష.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!