AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో 9 రేటింగ్

నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఐఎమ్ డీబీలో 9 రేటింగ్ ఉన్న ఈ సినిమా గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. IMDBలో 9 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 9:55 AM

Share

ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం, హిందీ దృశ్యం 3.. ది కంక్లూజన్, హనుమాన్ అంశ్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ వే తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఓ తెలుగు సూపర్ హిట్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (నవంబర్ 26) అర్ధరాత్రి నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ బయోపిక్ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. సిల్వర్ స్క్రీన్ పై ఆడియెన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్లను చూసి చాలా మంది ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కమర్షియల్ గా మంచి కలెక్షన్లు సాధించిన ఈ మూవీ కంటెంట్ పరంగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఐఎండీబీలో ఈ మూవీకి ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. థియేటర్లలో ఆడియెన్స్ ను కట్టి పడేసి ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా మరేదో కాదు తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’. దసరాకు థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ బయోపిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టింది.

‘గరివిడి లక్ష్మి’ లక్ష్మి సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ బయోపిక్ లో ఆనంది టైటిల్ రోల్ పాత్రలో అద్బుతంగా నటించగా, ఆమెతల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి తనదైన నటనతో మెప్పించారు. వీరితో పాటు రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్, షకలక శంకర్, కంచరపాలెం కిషోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం గరివిడి లక్ష్మి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో ఆనంది ‘గరివిడి లక్ష్మి’..

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us