Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్! టైటిల్ కూడా అద్దిరిపోయింది
సాధారణంగా హీరోలు కూడా డైరెక్షన్ చేస్తుంటారు. కెమెరా ముందు నుంచే కాకుండా కెమెరా వెనక నుంచొని యాక్షన్, కట్ అని చెబుతుంటారు. అయితే డైరెక్టర్లు హీరోలుగా మారడం చాలా అరుదు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ సంచలన దర్శకుడు హీరోగా మారాడు.

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? చాలా మంది గుర్తు పట్టేసే ఉంటారు. ఎందుకంటే ఆయన ఏం చేసినా సంచలనమే. గతంలో సినిమాలు చేయకున్నా తరచూ వార్తల్లో ఉంటారు. తన సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ తో తరచూ ట్రెండింగ్ లో ఉంటారు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతోంది. రామ్ గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో నే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మతో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2 సినిమాలు చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కాగా ఒకప్పటి స్టార్ హీరో సుమన్ ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని, అప్పుడే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు
అన్నట్లు రామ్ గోపాల్ వర్మ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా పేరు ఏమనుకుంటున్నారా? చాలా మంది ఆయనను షో మ్యాన్ అంటారు. ఇప్పుడు అదే టైటిల్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు ఆర్జీవీ. ‘షో మ్యాన్’.. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమాలోని ఇతర నటీనటులు, క్యాస్టింగ్ గురించి త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. గతంలో ఒక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు హీరోగా ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.
షో మ్యాన్ గా రామ్ గోపాల్ వర్మ.. విలన్ గా సుమన్..
#RamGopalVarma making his acting debut in a full fledged lead role with #Showman – Mad Monster pic.twitter.com/BIPSxQUzkh
— Sai Satish (@PROSaiSatish) December 5, 2025
అయితే ఈ సినిమాపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ ఇది ఫేక్ న్యూస్ అని, ఎవరో ఏఐ సాయంతో ఇలా క్రియేట్ చేశారని ట్వీట్ పెట్టాడు. అయితే కొందరు మాత్రం రామ్ గోపాల్ వర్మ కావాలనే ఇలా చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
This is FAKE NEWS done by A I pic.twitter.com/51xaNxMD1Q
— Ram Gopal Varma (@RGVzoomin) December 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




