AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి.. ఏ సినిమాలో అంటే..

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా నేడు (డిసెంబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు..

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి.. ఏ సినిమాలో అంటే..
Chiranjeevi, Balakrishna.
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2025 | 6:51 PM

Share

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2, బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న( నేడు) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది.. కానీ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు. ముఖ్యంగా అఘోర పాత్రలో దుమ్మురేపారు బాలయ్య.

ఇక ఇప్పుడు అఖండ 2లోనూ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు బాలకృష్ణ. అఖండ వన్ కంటే అఖండ 2లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది. మరోసారి అఘోర లుక్ లో ఫైట్స్ ఇరగదీశారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి కూడా అఘోర పాత్రలో నటించిన విషయం మీకు తెలుసా.? అవును మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ కంటే ముందు అఘోర పాత్రలో నటించారు.

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.. అలాగే చిరంజీవి శివుడిగా నటించిన అద్భుతమైన సినిమా శ్రీ మంజునాథ. అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చిరంజీవి శివుడిగా నటించారు. అలాగే ఇదే సినిమాలో అఘోరాగా కనిపించారు చిరంజీవి. ఓ సన్నివేశంలో ఆయన అఘోర పాత్రలో నటించారు. ఇక బాలకృష్ణ అఖండ లో అఘోరాగా కనిపించగా.. ఇప్పుడు అఖండ 2లో అఘోరగా కనిపించనున్నారు. అఖండ 2 విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్