AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

సాయి పల్లవిని ఇష్టపడని ప్రేక్షకులు ఉంటారా.? ఉండరనే చెప్పాలి.. ఈ ముద్దుగుమ్మను ఈ తరం సౌందర్య అని ఎంతో మంది పిలుచుకుంటున్నారు. ఎక్కడా స్కిన్ షో చేయకుండా కేవలం తన నటనతో ఎంతో ,మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2025 | 7:17 PM

Share

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలలో ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవిది ప్రత్యేక స్థానం. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసి.. యూత్ ఫెవరేట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ..కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటున్నారు. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా.. సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది సాయి పల్లవి. ఇటీవల నాగచైతన్య  నటించిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉంటే కాంట్రవర్సీలకు దూరంగా ఉండే సాయి పల్లవి గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. షూటింగ్ సెట్‏లో పొగరు చూపిస్తుందని.. ఆటిట్యూడ్ ఉంటుందని.. హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. గతంలో యంగ్ హీరో నాగశౌర్య కూడా సాయి పల్లవి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వీరిద్దరు కలిసి కణం అనే సినిమా చేశారు. ఆ సినిమా చేసేటప్పుడు నాగశౌర్య.. సాయి పల్లవి పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై  సాయి పల్లవి కూడా క్లారిటీ ఇచ్చింది. నాగశౌర్య మాట్లాడుతూ.. తాను నటించిన హీరోయిన్స్ లో ఇరిటేషన్ తెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పాడు. అలాగే ఆమె ప్రవర్తన వేరుగా ఉంటుందని, షూటింగ్స్ కు ఆలస్యంగా వస్తుందని , పొగరుగా ప్రవర్తిస్తుందనే విధంగా చెప్పుకొచ్చాడు.

దీని పై సాయి పల్లవి మాట్లాడుతూ.. “నా వలన ఎవరైన ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే బాధగా ఉంటుంది. హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్ చేశాడు. అది విని నేను చాలా బాధపడ్డాను. వెంటనే కణం డైరెక్టర్ కు.. సినిమాటోగ్రాఫర్ కు కాల్ చేసి నా వలన మీకు ఇబ్బంది కలిగిందా ? అని అడిగాను. వారు లేదు అని చెప్పడంతో మనసు కుదుటపడింది. ఇక శౌర్య అంటే నాకు ఇష్టం. నటన బాగుంటుంది. నాలో నచ్చిందే అందరు చెప్తారు. శౌర్య నాలో నచ్చనిది చెప్పాడు. దానిని పాజిటివ్ గానే తీసుకున్నాను.. నావలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే .. నా సమాధానంతో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.