నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. వరుసగా చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలన్నీ పాన్ ఇండియా గా విడుదలవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు అలా వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. ఇక చాలా సినిమాలు రీమేక్ కూడా అవుతున్నాయి.

ఇప్పుడంటే పాన్ ఇండియా రేంజ్ అంటూ.. ఒక సినిమాను ఐదు ఆరు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ గతంలో అలా ఉండేది కాదు. ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యిందంటే దాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేసేవారు. తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు చాలా బాలీవుడ్‌లోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే బాలీవుడ్‌లో లేదా తమిళ్‌లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతూ, రీమేక్ అవుతూ వచ్చాయి. ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ సినిమా నాలుగు భాషల్లో రీమేక్ అయ్యింది. కానీ తెలుగులో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. మిగిలిన భాషల్లో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. పైగా ఆ రీమేక్స్‌లో స్టార్ హీరోలు నటించారు. ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ హీరోలు ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. అలాగే మంచి విజయాలను కూడా అందుకున్నాయి. మలయాళంలో తెరకెక్కిన సినిమాలు చాలా తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. వాటిలో బాడీగార్డ్ సినిమా ఒకటి. మలయాళంలో 2010లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాడీగార్డ్ సినిమా అక్కడ భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అక్కడ కూడా ఈ సినిమా రూ.100 క్లబ్‌లో చేరింది.
అలాగే తమిళ్ లో దళపతి విజయ్ ఈ మూవీని రీమేక్ చేశారు. ఆసిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఏకంగా రూ. 100కోట్లు వసూల్ చేసింది ఈ సినిమా. రజనీకాంత్ నటించని శివాజి, రోబో సినిమాల కలెక్షన్స్ ను టచ్ చేసింది ఈ సినిమా. ఇక ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో సిద్దిఖీ దర్శకత్వం వహించాడు. తెలుగులో గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. నాలుగు భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




