Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew nut: జీడి పప్పుకి పెరుగుతున్న డిమాండ్..తగ్గిన దిగుబడి.. ధరలకు మాత్రం త్వరలో రెక్కలు

జీడిపప్పు ధరలు పెరగటానికి వివిధ కారణాలు చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. దేశవ్యాప్తంగా మరో రెండు వారాలలో పండుగల సీజన్ ప్రారంభం కానున్నది. రాఖి పౌర్ణమి మొదలుకొని కృష్ణాష్టమి, కేరళ వారు ఘనంగా జరుపుకునే ఓనం ,గణేష్ ఉత్సవాలు, దేవి నవరాత్రులు, దీపావళి , మహా శివరాత్రి, క్రిష్ మస్, సంక్రాంతి ఇలా జనవరి వరకు వరుసగా పండగలే పండగలు. దీంతో నైవేద్యాలు,ప్రసాదాల తయారి, గిఫ్ట్ ల రూపంలో జీడిపప్పు వాడకం ఎక్కువుగానే ఉంటుంది.

Cashew nut: జీడి పప్పుకి పెరుగుతున్న డిమాండ్..తగ్గిన దిగుబడి.. ధరలకు మాత్రం త్వరలో రెక్కలు
Cashew Nut Price Hike
Follow us
S Srinivasa Rao

| Edited By: Surya Kala

Updated on: Aug 14, 2024 | 12:20 PM

కేంద్ర బడ్జెట్ తరువాత బంగారం ధరలు దిగి వస్తే.. తెల్ల బంగారం (జీడి పప్పు) ధరలకు మాత్రం త్వరలో రెక్కలు రానున్నాయి. ఈసారి బడ్జెట్ ప్రభావం లేనప్పటికీ దేశీయ, అంతర్జాతీయపరంగా వచ్చిన మార్పులే జీడి పప్పు ధరల పెరుగుదలకు కారణం అంటున్నాయి మార్కెట్ వర్గాలు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగష్టు రెండవ వారం నుంచే ఈ డ్రై ప్రుట్ ధర ప్రియం కానున్నాదట.

తెల్ల బంగారంగా పిలిచే జీడిపప్పు అంటే ఇష్టపడని వారు ఉండరు. రుచికి రుచి….పోషకాలకు పోషకాలు… జీడి పప్పు సొంతం. ఆరోగ్యంగా ఉండేందుకు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం చాలామంచింది. వీటిలో ముందు వరుసలో ఉండేది జీడిపప్పు. దీనిని పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ జీడిపప్పు తింటే రోగ నిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.అందుకే మరి దీని ధరకూడా వివిధ కేటగిరీల ను బట్టి కేజీ రూ.8వందల నుంచి రూ.12 వందలు వరకు ఉంటుంది. అయితే ఇటీవల జీడిపప్పు ధర స్వల్పంగా తగ్గినప్పటికీ తిరిగి మళ్ళీ వాటి ధరలకు రెక్కలు రానున్నాయట.

జీడిపప్పు ధరలు పెరగటానికి వివిధ కారణాలు చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. దేశవ్యాప్తంగా మరో రెండు వారాలలో పండుగల సీజన్ ప్రారంభం కానున్నది. రాఖి పౌర్ణమి మొదలుకొని కృష్ణాష్టమి, కేరళ వారు ఘనంగా జరుపుకునే ఓనం ,గణేష్ ఉత్సవాలు, దేవి నవరాత్రులు, దీపావళి , మహా శివరాత్రి, క్రిష్ మస్, సంక్రాంతి ఇలా జనవరి వరకు వరుసగా పండగలే పండగలు. దీంతో నైవేద్యాలు,ప్రసాదాల తయారి, గిఫ్ట్ ల రూపంలో జీడిపప్పు వాడకం ఎక్కువుగానే ఉంటుంది. దీంతో డిమాండ్ ఉన్నప్పుడే దండుకోవాలన్న మార్కెట్ సూత్రం బట్టి ప్రతియేటా ఈ సీజన్ వచ్చేసరికి జీడిపప్పు ధరలు పెరగడం సహజంగానే ఉంటుంది. అయితే ఈసారి

ఇవి కూడా చదవండి

వాతావరణ మార్పులు కారణoగా భారత్ సహా ఇతర దేశాలలోను జీడి పిక్కల ఉత్పత్తి తగ్గిందని జీడి పప్పు ధరలు పెరుగుతాయనడానికి ఇది ప్రధాన కారణం అవుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేసిస్తున్నాయి. ఈ ఏడాది భారత్లోని జీడిపిక్కల ఉత్పాదక ప్రాంతాలలో భారీ తరుగు నమోదయింది. అంతేకాకుండా వియత్నాం, ఆఫ్రికా లాంటి మరి కొన్ని దేశాలలో జీడిపిక్కల ఉత్పత్తి దాదాపు 25 శాతం తగ్గింది. ఎల్నినొ ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున జీడిపిక్కల ప్రపంచ ఉత్పత్తిలో 7 శాతం మేర తగ్గనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు గతంలో జీడిపప్పు వాడకం సంపన్న వర్గాలకే పరిమితం కాగా కరోనా తరువాత మిగిలిన వర్గాలు సైతం జీడిపప్పు వాడకం పట్ల ఆకర్షితులవుతున్నాయి. వినియోగదారులలో ఆరోగ్య పరిరక్షణ కోసం పెంపొందుతున్న అవగాహన మరియు వృద్ధి చెందుతున్న జీవన ప్రమాణాలతో జీడిపప్పు వినియోగం ప్రతియేటా 7 శాతం చొప్పున వృద్ధి నమోదవుతున్నది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ యేడాది జీడిపిక్కల దిగుబడి తగ్గటంతో రైతులు సాగు చేసే జీడి పిక్కలకు కొంతమేర ధరలు పెరిగాయి.ఉత్పాదక దేశాలలో జీడిపిక్కల ఉత్పత్తి తగ్గినందున ఈ ఏడాది ఏప్రిల్-మే లో టన్ను జీడి పిక్కల ధర తన్ను 1200 – 1300 డాలర్లు పలకిగా…తాజాగా వాటి ధర పెరిగి 1900-2000 డాలర్కు ఎగబాకింది. శ్రీకాకుళం జిల్లాలో 2014 లో 80 కేజీ ల జీడిపిక్కలు రూ. 14 వేలు పలకగా….తరువాత కాలంలో అది రూ. 12వేలు అంతకన్నా తక్కువకు పడిపోయింది. అయితే ఈ ఏడాది దిగుబడి తగ్గటంతో 80కేజీ ల జీడి పిక్కల ధర తిరిగి రూ. 14 వేలకు చేరుకుంది. అయితే జీడిపప్పుకు ధరలు పెరిగిన జీడి పిక్కలు పండించే రైతులకు మాత్రం ఆమెర లాభాలు దక్కటం లేదని రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగష్టు నుంచి ప్రపంచ వ్యాప్తంగా జీడిపిక్కలు మరియు పప్పు ధరలు దీపావళి వరకు భారీగా పెరగగలవనే అంచనా వ్యక్తమవుతున్నది. 2025 లో కోతల సీజన్ తర్వాత ధరలు దిగిరావచ్చని విశ్వసిస్తున్నారు. మొత్తంగా చూస్తే 2024 లో ప్రపంచ జీడిపిక్కల మార్కెట్ 782 కోట్ల డాలర్కు చేరగా 2029 నాటికి 3.31 శాతం వార్షిక వృద్ధి రేటుతో 920 కోట్ల డాలర్లు తాకవచ్చని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..