Millionaire Thief: దొంగతనం ఇతనికి వ్యసనం.. సరదా కోసం స్కూటర్లను దొంగలిస్తున్న కోటీశ్వరుడు..

అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 150కి పైగా యాక్టివాలు దొంగిలించబడ్డాయి. యాక్టివా దొంగతనం గణాంకాలు పెరుగుతున్నాయి. ఈ సమాచారం క్రైమ్ బ్రాంచ్ కి చేరగా రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. నిందితుడు దొంగిలించిన యాక్టివాపై ప్రయాణం చేస్తూ పిరానాలో పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70 యాక్టివాలు దొంగిలించాడని పిరానా సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో కొన్ని యాక్టివాలు ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి 20 చోరీ ఆస్తులను క్రైం బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది.

Millionaire Thief: దొంగతనం ఇతనికి వ్యసనం.. సరదా కోసం స్కూటర్లను దొంగలిస్తున్న కోటీశ్వరుడు..
Millionaire Thief
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2024 | 11:15 AM

కొందరికి కొన్ని రకాల వ్యసనాలు ఉంటాయి. మందు, జ్యూదం మాత్రమే కాదు అనేక రకాల వ్యసనాల గురించి తెల్సిందే.. అయితే ఎవరికైనా దొంగతనాలు చేయడం కూడా వ్యసనమే అన్న సంగతి తెలుసా.. గుజరాత్ ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తీకి డబ్బులకు లోటు లేదు తండ్రి కోటీశ్వరుడు.. అయినా తన సరదాను తీర్చుకోవడానికి దొంగతనం బాట పట్టాడు. దొంగతనం చేయడం అంటే ఇష్టం.. దీంతో దొంగగా మారాడు. అది కూడా ఎక్కువుగా యాక్టివా బండ్లను దొంగతనం చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే..

అహ్మదాబాద్‌లో ఒకటి కాదు రెండు కాదు మొత్తం 168 యాక్టీవాలను దొంగిలించిన కోటీశ్వరుడు దొంగ పట్టుబడ్డాడు. వాస్తవానికి హితేష్ జైన్ కు లగ్జరీ కార్లలో ప్రయణం అంటే చాలా ఇష్టం.. దీంతో తన కోరికను తీర్చుకోవడానికి దొంతతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఒక యాక్టివాను దొంగిలించేవాడు. అయితే, దొంగిలించిన ఈ యాక్టివాలను అతడు ఎవరికీ విక్రయించలేదు. అలా దొంగిలించిన యాక్టివాతో వివిధ ప్రాంతాలలో తిరిగేవాడు. ఆ తర్వాత యాక్టివాలో పెట్రోల్ అయిపోయిన తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు.

ఈ విధంగా అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో సుమారు 150కి పైగా యాక్టివాలు దొంగిలించబడ్డాయి. యాక్టివా దొంగతనం గణాంకాలు పెరుగుతున్నాయి. ఈ సమాచారం క్రైమ్ బ్రాంచ్ కి చేరగా రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. నిందితుడు దొంగిలించిన యాక్టివాపై ప్రయాణం చేస్తూ పిరానాలో పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70 యాక్టివాలు దొంగిలించాడని పిరానా సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో కొన్ని యాక్టివాలు ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి 20 చోరీ ఆస్తులను క్రైం బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

అరెస్టయిన నిందితుడు హితేష్ జైన్ 9 ఏళ్ల క్రితం నుంచి సాధారణ జీవితం గడుపుతున్నాడు. పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి షాహీబాగ్‌లో కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అతనికి కార్లు కూడా ఉన్నాయి. అయితే 2016లో హితేష్ జైన్ దంపతుల మధ్య విభేదాలు రావడంతో అతని ఇల్లు చిన్నాభిన్నం అయింది. కోటీశ్వరుడు అయిన హితేష్ నేరాలు చేయడం వైపు మొగ్గు చూపాడు. నిందితుడు హితేష్ మొదట్లో డబ్బులను దొంగిలించగా.. దొంగతనం అతనికి వ్యసనంగా మారడంతో.. 2015 నుండి యాక్టివాను దొంగిలించడం మొదలు పెట్టాడు. ఇప్పటివరకు అనేక ఆస్తులను దోచుకుంది.

ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హితేష్ షాహిబాగ్‌లోని కిరణ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. హితేష్ తండ్రి షాహీబాగ్‌లోనే చీరల దుకాణం ఉంది. హితేష్ 10వ తరగతి వరకు మాత్రమే చదివి గతంలో స్కూటర్ దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. సూరత్, పోర్‌బందర్, రాజ్‌కోట్‌లలో మూడుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. ట్రాఫిక్‌ జంక్షన్‌లోని సీసీటీవీలో అసలు నంబర్‌ కనిపించకుండా ఉండేలా యాక్టివాను దొంగిలించి నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ చేసేవాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..