Saturday Puja Tips: శని దోష నివారణకు శనివారం హనుమంతుడి పూజ, నువ్వుల నూనె విశిష్టం..ఎందుకంటే
శ్రీ రాముడు పని పూర్తి చేసిన తర్వాత మొత్తం శరీరాన్ని శనిశ్వరుడికి అంకితం చేస్తానని హనుమంతుడు చెప్పాడు. అయితే హనుమంతుడు చేసిన అభ్యర్థనను శనిదేవుడు అంగీకరించలేదు. శనిదేవుడు అదృశ్య రూపంలో హనుమంతుడి శరీరాన్ని ఆవహించాడు. అప్పుడు హనుమంతుడు సేతు నిర్మాణం కోసం రాళ్ళని కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో హనుమాన్ ని ఆవహించి ఉన్న శనిదేవుడుకి తీవ్రగాయాలయ్యాయి. శరీరంలోని ప్రతి భాగం గాయపడింది. అప్పుడు శనిదేవుడు తన చర్యకు హనుమంతుడికి క్షమాపణలు చెప్పాడు.
నవగ్రహాలలో శనీశ్వరుడు కర్మ ప్రధాత. మనిషి కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు. అందుకే శనీశ్వరుని ఆరాధనకు శనివారం ప్రత్యేకంగా భావిస్తారు. శనీశ్వరుడు అశుభ ప్రభావాలను తగ్గించడానికి.. అనుగ్రహాన్ని పొందడానికి వివిధ రకాల పూజలను చేస్తారు. శనిదేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పిస్తారు. చాలా మంది శనీశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ చర్యను పురాతన సంప్రదాయంగా భావిస్తారు. అయితే పురాణాల ప్రకారం.. శనీశ్వరునికి అత్యంత ఇష్టమైన నూనే.. నువ్వుల నూనెతో నొప్పి నుండి ఉపశమనం పొందుతాడు. అందుకనే నువ్వుల నూనెను సమర్పించిన వ్యక్తిని ఆశీర్వదిస్తాడు.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం హనుమంతుడుపై శనీశ్వర ప్రభావం ప్రారంభమవ్వాల్సిన సమయం ఆసన్నం అయింది. అయితే అప్పుడు హనుమంతుడి అధ్వర్యంలో సముద్రం మీద రామసేతును నిర్మించే పని జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణాన్ని రాక్షసులు అడ్డుకుంటారనే భయంతో.. వంతెనను రక్షించే బాధ్యత హనుమంతుడికి అప్పగించారు. అయితే అదే సమయంలో హనుమంతునిపై శనిగ్రహ కాలం ప్రారంభమవుతుంది. హనుమంతుడి శక్తి , కీర్తిని తెలుసుకున్న శనిశ్వరుడు గ్రహ కదలికల అమరిక, నియమాలను వివరించి తన కర్తవ్యాన్ని వివరించాడు. అప్పుడు హనుమంతుడు ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని, అయితే తాను ఇప్పుడు రాముడికి సేవ చేయడం తనకు అత్యంత ప్రధానమని శనిస్వరునికి చెప్పాడు.
హనుమంతుడిని క్షమించమని కోరిన శనీశ్వరుడు
శ్రీ రాముడు పని పూర్తి చేసిన తర్వాత మొత్తం శరీరాన్ని శనిశ్వరుడికి అంకితం చేస్తానని హనుమంతుడు చెప్పాడు. అయితే హనుమంతుడు చేసిన అభ్యర్థనను శనిదేవుడు అంగీకరించలేదు. శనిదేవుడు అదృశ్య రూపంలో హనుమంతుడి శరీరాన్ని ఆవహించాడు. అప్పుడు హనుమంతుడు సేతు నిర్మాణం కోసం రాళ్ళని కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో హనుమాన్ ని ఆవహించి ఉన్న శనిదేవుడుకి తీవ్రగాయాలయ్యాయి. శరీరంలోని ప్రతి భాగం గాయపడింది. అప్పుడు శనిదేవుడు తన చర్యకు హనుమంతుడికి క్షమాపణలు చెప్పాడు.
అంతేకాదు హనుమంతుడిని పూజించే భక్తులకు తను ఎప్పడూ హాని చేయనని శనీశ్వరుడు వాగ్దానం చేశాడు. అప్పుడు రామ భక్త హనుమాన్ .. శనిదేవుడు ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనె ఇచ్చాడు. అప్పుడు తన శరీరానికి నువ్వుల నూనెను పూసుకోవడంతో అతని నొప్పులు తగ్గాయి. అప్పటి నుండి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెను నైవేద్యంగా పెడతారు.
ఛాయా దేవి సూర్యుడు తనయుడు శనీశ్వరుడు
పురాణాల ప్రకారం సూర్యుని భార్య సంధ్య నీడ ఛాయా దేవికి సూర్యుడికి జన్మించాడు. ఛాయా దేవి శివుని భక్తులు రాలు.. గర్భంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు కూడా శంకరుడు భక్తిలో మునిగిపోయింది. ఛాయా దేవి నీడ కనుక ఆ ప్రభావం ఆమె కొడుకుపై ప్రభావం చూపింది. దీంతో శనిశ్వరుడి ఛాయ నల్లగా మారింది. తన కొడుకు నల్లగా ఉండడం చూసి సూర్యుడు తన భార్య ఛాయను శని తన కొడుకు కాదని దూషించాడు. అప్పటి నుండి శనిశ్వరుడికి తన తండ్రి సూర్యుడితో శత్రుత్వం ఏర్పడింది.
శనీశ్వరుడు తన సాధన, తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తండ్రి సూర్యుని వలె శక్తిని పొందాడు. శివుడు శని దేవుడిని వరం కోరమని అడిగినప్పుడు.. తన తల్లి ఛాయా దేవిని సూర్యుడు అవమానించిన విషయం చెప్పాడు. అందుకే నేను సూర్యుడి కంటే శక్తివంతం కావాలని అమ్మ కోరుకుంటుంది. కనుక తాను సూర్యుడికంటే శక్తి కలిగే విధంగా వరం ఇవ్వమని కోరాడు. అప్పుడు శనిశ్వరుడికి వరం ఇచ్చి తొమ్మిది గ్రహాలలో నీకు ఉత్తమ స్థానం ఉంటుందని చెప్పాడు. దేవతలు, మనుషులు కూడా నీ పేరు వింటే భయపడతారు. కర్మలను అనుసరించి శిక్షలను ఇచ్చే న్యాయమూర్తిని చేశాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు