మొగలి పువ్వులతో పూజలను అందుకునే శివయ్య.. తెలంగాణలోనే మహిమానిత్వ శివయ్య క్షేత్రం ఎక్కడంటే..

ఇక్కడ ఉన్న నీటి గుండం ఒక అద్భుతం. ఈ దేవాలయ విశిష్ట గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. స్కంద పురాణం ప్రకారం పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో వనంగా అంటే మొగలి వనంగా మారిందట. తన శాప పరిహారం కోసం బ్రహ్మ దేవుడు కేతకి వనంలో శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడ శివుడిని కేతకి సంగమేశ్వరుడిగా పిలుస్తారు.

మొగలి పువ్వులతో పూజలను అందుకునే శివయ్య.. తెలంగాణలోనే మహిమానిత్వ శివయ్య క్షేత్రం ఎక్కడంటే..
Ketaki Sangameshwara Swamy
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jan 05, 2024 | 7:08 AM

భారత దేశం ఆధ్యాత్మిక ప్రదేశం.. కొండకోనల్లో మాత్రమే కాదు ప్రతి గ్రామం లో ఏదో ఒక గుడి ఉంటుంది. ఆ  ఒక్కో గుడిది ఒక్కో ప్రత్యేకత ఉంది. అదే విధంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ లో కూడా కేతకి సంగమేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది..ఎక్కడ లేని విధంగా శివయ్యను మొగలి  రేకులతో పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో ఉన్న నీటి గుండం నుండి పూజ విధానం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకతనే..  శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సాధారణంగా ఆలయానికి ముందు భాగంలో కోనేరు ఉంటుంది దీనిని చూడటానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఇక్కడ ఉన్న నీటి గుండం ఒక అద్భుతం. ఈ దేవాలయ విశిష్ట గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. స్కంద పురాణం ప్రకారం పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో వనంగా అంటే మొగలి వనంగా మారిందట. తన శాప పరిహారం కోసం బ్రహ్మ దేవుడు కేతకి వనంలో శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఇక్కడ శివుడిని కేతకి సంగమేశ్వరుడిగా పిలుస్తారు. ఆలయానికి కేతకి సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది.

ఈ దేవాలయంలో పరమేశ్వరుడు పార్వతి సమేతంగా కొలువు దీరి ఉన్నాడు. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక కోనేరులో కాశీలో ప్రవహించే గంగా నది ధారా భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుంది అని నమ్మకం. స్వామివారికి మధ్యాహ్నం నైవేద్యం ఈ గుండంలోనే పెడుతారు. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంటుంది.  గుండంలోని నీరు నిండుగా ఉన్నపుడు ఈ రంధ్రం కనిపించదు. ప్రతిరోజు మధ్యాహ్నం గుండం లోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామి వారికీ ఒక ఆకులో నైవేద్యం పెట్టగా ఆకుతో పాటుగా ఆ నైవేద్యం రంధ్రం గుండా వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆలా నీరు ఒక సొరంగం లోనికి వెళ్తుంది అని నమ్మకం. నీటితో పాటు నైవెద్యం కూడా లోపలికి వెళ్ళిపోయి కాసేపటికి ఆ గుండం తిరిగి స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది. ఇదంతా సంగమేశ్వరుడి లీలగా భక్తులు భావిస్తారు. అంతేకాదు ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ రోగాలు, పాపాలు హరించిపోతాయని భక్తుల ప్రగడ నమ్మకం.

ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంది. దీనిని చేతి వేళ్ళతో పైకి లేపితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం. దీనిని కోరికల లింగం అని పిలుస్తారు.  ఈ ఆలయానికి తెలంగాణ లోని జిల్లాల నుండే కాదు మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!