Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: సరయూ నది తీరంలో కొలువు దీరనున్న రామయ్య… విగ్రహానికి రూ.3 వేల కోట్లు

నగరంలోని సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న ఈ రామయ్య విగ్రహం 823 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు. ఈ విగ్రహ తయారీకి భారీగా బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేయనున్నారనే టాక్. ఈ విగ్రహం తయారీకి వేల టన్నుల లోహాన్ని ఉపయోగించనున్నారు. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పకళారుడు నరేష్ చాలా ప్రసిద్ధిగాంచారు. ఇప్పటికే ఈయన తయారు చేసిన చాలా విగ్రహాలు దేశంలో మాత్రమే కాదు విదేశాలలో కూడా స్థాపించబడ్డాయి

Ayodhya: సరయూ నది తీరంలో కొలువు దీరనున్న రామయ్య... విగ్రహానికి రూ.3 వేల కోట్లు
Tallest Sri Rama Statue
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2024 | 9:39 AM

రామయ్య జన్మ భూమి అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ట కోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా 823 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అవుతుంది. గురుగ్రామ్ శిల్పి నరేష్ కుమావత్ ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 2 నుండి 3 సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు.

823 అడుగుల ఎత్తు శ్రీరాముని విగ్రహం

నగరంలోని సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న ఈ రామయ్య విగ్రహం 823 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు. ఈ విగ్రహ తయారీకి భారీగా బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. అత్యంత ఎత్తైన ఈ విగ్రహ తయారీకి దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేయనున్నారనే టాక్. ఈ విగ్రహం తయారీకి వేల టన్నుల లోహాన్ని ఉపయోగించనున్నారు. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పకళారుడు నరేష్ చాలా ప్రసిద్ధిగాంచారు. ఇప్పటికే ఈయన తయారు చేసిన చాలా విగ్రహాలు దేశంలో మాత్రమే కాదు విదేశాలలో కూడా స్థాపించబడ్డాయి. సరయూ నది ఒడ్డున 823 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

ఇవి కూడా చదవండి

గురుగ్రామ్ కి చెందిన నరేష్ కుమావత్ ప్రసిద్ధ శిల్పి. ఇప్పటికే నమో ఘాట్, పరశురాముడి విగ్రహం, రాముడి విగ్రహంతో సహా 250 కి పైగా విగ్రహాలను తయారు చేశారు. ఈసారి 823 అడుగుల ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను ఆయన స్వీకరించారు. తనకు ఇంతటి బాధ్యత అప్పగించినందుకు నరేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విగ్రహ తయారీ పూర్తి అయిన తర్వాత అయోధ్యలో మాత్రమే చరిత్ర పుటల్లో ఆయన పేరు నిలిచిపోతుంది. నరేష్ పేరు ఎప్పటికీ అయోధ్యతో ముడిపడి ఉంటుంది.

వార్తల్లో నిలిచిన రాముడి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పులు

రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్టించే బాల రామయ్య విగ్రహం ఇప్పటికే రెడీ అవ్వగా.. ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు విగ్రహాలను తయారు చేశారు. ఈ 3 విగ్రహల్లో ఏదైనా ఒకటి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో గర్భగుడిలో ప్రతిష్టించబడుతుంది. శిల్పులు అరుణ్ యోగిరాజ్ , జిఎల్ భట్ లు శ్రీరాముని నలుపు రంగు విగ్రహాలను తయారు చేశారని, రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లటి రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ముగ్గురు శిల్పులు తయారు చేసిన విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని గర్భ గుడిలో ప్రతిష్టించడం కోసం రామమందిర్ ట్రస్ట్ కమిటీ ఎంపిక చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..