AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య రామమందిరం

అయోధ్య రామమందిరం

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది. లక్షలమంది హాజరయ్యే భవ్య రామ మందిర మహా సంరంభ వేడుకకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ మహాత్కార్యంలో తామూ భాగస్వాములయ్యేందుకు భక్తజనం ఉవ్విళ్లూరుతోంది. జగదానంద కారక..జయ జానకి ప్రాణ నాయక ..శుభ స్వాగతం..ప్రియా పరిపాలక మంగళకరం నీరాక…మా జీవనమే పావనమవుగాక…అంటూ భక్తకోటి ఆశ్రీరాముడ్ని తలచుకుని పాడుతోంది. భవ్యరామమందిరంలో మన రామయ్య కొలువయ్యేనాటికి ఎన్నో అద్భుతాలు సాత్కారించబోతున్నాయి. ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్రఘనంగా ఉంది.

2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన..భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల శుభ ముహుర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అంటే శతాబ్దాల యావత్ హిందువుల కల 84 సెకన్లలో పరిపూర్ణమవుతుంది. మేషలగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితి ఉండవల్ల రాజయోగం కలుగుతుంది. సాధారంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహుర్తంగా పరిగణిస్తారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం.
భూకంపాలు..సునామీ..ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే..అయోధ్య ఠీవీ ఇంచుమించు మాత్రం కూడా చెక్కు చెదరదు. అయోధ్య భవ్య రామమందిరం అర్కిటెక్చర్‌ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది.

ఇంకా చదవండి

వందల ఏళ్ల.. కోట్లాది హిందువుల ఆత్మాభిమానం.. ధర్మధ్వజంతో పూర్తైన ఆఖరిఘట్టం!

అయోధ్య అంటే ఏంటి? వేదంలో దీనికున్న నిర్వచనం.. ఎవరూ జయించలేనిది అని. అందుకే రామయ్య పూర్వీకులు తమ రాజ్యానికి అయోధ్య అని పేరు పెట్టుకున్నారు. అసలు రామాయణం జరిగి కోటి సంవత్సరాలకు పైనే అయి ఉంటుందని అంచనా. ఇక అయోధ్యాపురి ఇంకెన్నాళ్ల క్రితందో. ఏ ముహూర్తాన అయోధ్య అని పేరు పెట్టారోగానీ.. ఇప్పటికీ నిలిచే ఉందా నగరి.

అయోధ్యలో అద్భుత ఘట్టం.. ధ్వజారోహణ ఫొటోస్

అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం చోటు చేసుకుంది. నేడు (మంగళ వారం, నవంబర్ 25న) అయోధ్యలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయినందకు చిహ్నంగా ఆలయ శిఖరంపై మోదీ ధ్వజారోహణం చేయడం జరిగింది.

PM Modi in Ayodhya Highlights: అంతా రామమయం.. అయోధ్య ఆలయ శిఖరంపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం ఇవాళ్టితో పూర్తయింది.. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ తో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఆలయపనుల ముగింపునకు గుర్తుగా ఈ ధ్వజారోహణ చేశారు.

అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం.. ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి.. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారు.

PM Modi: అయోధ్యకు ప్రధాని మోదీ.. పట్టణమంతా పండగ వాతావరణం..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు (నవంబర్‌ 25 మంగళవారం) అయోధ్య పర్యటనలో భాగంగా శ్రీ రామ్‌లల్లా ఆలయంలో పవిత్ర ధ్వజారోహణంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం పైభాగంలో కాషాయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, అయోధ్య నగరం ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతోంది.

28 లక్షల దీపాలతో ప్రకాశిస్తున్న రాముడి నగరం.. ఆకట్టుకున్న లేజర్‌, డ్రోన్‌ షో, గ్రీన్‌ ఫైర్‌ వర్క్స్‌

అయోధ్య నగరం ఈ దీపావళి వేళ చరిత్ర సృష్టించింది. భక్తుల సందడి, దీపాల కాంతి, సరయూ నదీ తీరంలోని ఆ భవ్య దృశ్యం ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా.. 9వ దీపోత్సవం కనుల పండువగా సాగింది. రామజన్మభూమి ప్రాంగణం నుంచి సరయూ తీరం వరకు వెలుగుల హారం విరిసే ఈ మహోత్సవం భారత సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది.

Manchu Manoj: ‘మిరాయ్’ గ్రాండ్ సక్సెస్‌.. అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న మంచు మనోజ్.. ఫొటోస్ ఇదిగో

మంచు మనోజ్.. చాలా కాలం తర్వాత మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊరటనిచ్చింది ఈ సినిమా. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలకపాత్రలలో నటించగా..కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.

Ayodhya: అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నారా.? ఈ ప్రదేశాలు మిస్ కావద్దు..

 గత ఏడాది హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం జరిగింది. చాలామంది బాలరాముడి దర్శనానికి వెళ్తున్నారు. మీరు కూడా అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేస్తే మాత్రం రామ మందిరంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం.. 

Ayodhya: రామాలయంలో రామ దర్భార్ లో కొలువైన సీతారామ పరివారం.. రామరాజ్య ఆస్థానం ఎలా ఉందంటే..?

అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో బాల రామయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇప్పుడు రామ మందిరంలో రామ దర్భార్ ఏర్పాటు పూర్తి అయింది. ఈ రామ దర్భార్ లో సీతారాములు.. లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి ఆస్థానంలో తన ఆసనాన్ని అధిష్టించారు. ఈ దృశ్యం రామరాజ్యం, న్యాయం, కరుణ.. ఆదర్శం ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉంది.

సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా.