AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామాలయంలో రామ దర్భార్ లో కొలువైన సీతారామ పరివారం.. రామరాజ్య ఆస్థానం ఎలా ఉందంటే..?

అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో బాల రామయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇప్పుడు రామ మందిరంలో రామ దర్భార్ ఏర్పాటు పూర్తి అయింది. ఈ రామ దర్భార్ లో సీతారాములు.. లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి ఆస్థానంలో తన ఆసనాన్ని అధిష్టించారు. ఈ దృశ్యం రామరాజ్యం, న్యాయం, కరుణ.. ఆదర్శం ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉంది.

Ayodhya: రామాలయంలో రామ దర్భార్ లో కొలువైన సీతారామ పరివారం.. రామరాజ్య ఆస్థానం ఎలా ఉందంటే..?
Rama Darbhar In Ayodhya
Surya Kala
|

Updated on: Jun 05, 2025 | 3:32 PM

Share

2024 జనవరి 22న బాలుడి రూపంలో రామ్ లల్లా రామ జన్మభూమి అయోధ్యలోని గర్భగుడిలో ప్రతిష్టించబడ్డాడు. అప్పటి నుంచి అయోధ్యకు భారీ సంఖ్యలో రామయ్య భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు రామాలయ ప్రాంగణంలో మరో అరుదైన ఘట్టం పూర్తి అయింది. మర్యాద పురుషోత్తమ భగవానుడు శ్రీరాముడు రామమందిరంలోని మొదటి అంతస్తులోని తన రాజ దర్భార్ లో రాజుగా సీతా సమేతుడై ఆసీనుడయ్యాడు. దీంతో అయోధ్య మరో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించింది. రామ దర్భలో ప్రతిష్టించినవి కేవలం చూసేందుకు విగ్రహాలు కాదు.. అది యుగంలో రామయ్య పాలనకి సజీవ దృశ్యం.

ఈ రామ దర్భార్ లో శ్రీరాముడు భార్య సీతా దేవిలతో పాటు సోదరుడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు, భక్త హనుమంతుడు. గురు వశిష్ఠ మహర్షి కూడా ఆశీనులై ఉన్నారు. ఈ దృశ్యం మొత్తం వేదాలు, పురాణాలలో చెప్పబడిన త్రేతా యుగంలోని అద్భుతమైన రామరాజ్యాన్ని మనకు నేరుగా గుర్తు చేస్తుంది. గోస్వామి తులసీదాస్ రామచరితమానస్ రాసిన రామరాజ్యం మూడు లోకాలలో ఏర్పడింది.. సమస్త దుఃఖాలు తొలగి.. ఆనందం మొదలైంది.. అన్న మాటలకు ఇప్పుడు ఈ రామ దర్భార్ తో నేడు అయోధ్యలో సజీవ దృశ్యంగా కనుల ముందు నిలిచింది.

రామరాజ్య ఆస్థానం ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి

రాముడి ఆస్థానం న్యాయం, కరుణ, ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉండేది. సింహాసనంపై కూర్చున్నప్పుడు రాముడు తన ప్రజల ప్రతి సుఖ దుఃఖాన్ని తన బాధ్యతగా భావించాడు. కేవలం రాజు మాత్రమే కాదు, అతను ఒక ‘రాజర్షి’. తపస్సు, త్యాగం , సేవలకు సజీవ స్వరూపం. ఆస్థానం దృశ్యం అద్భుతంగా ఉంది. బంగారంతో పొదిగిన సింహాసనం, సింహాల బొమ్మలు, శ్రీరాముడి కుటుంబం, దాని చుట్టూ నిలబడి ఉన్న సేవకులు, అలంకరించబడిన వేదిక. ఇది కేవలం నిర్మాణ కళ కాదు.. ఇది హిందువుల రామ రాజ్యం విశ్వాసానికి రూపం.

Rama Darbhar

Rama Darbhar

రామ రాజ్యం వైపు తొలి అడుగు అయోధ్యలో ప్రారంభమైన రామ దర్భార్ నేటి యుగపు ప్రజలకు రామరాజ్యం కేవలం ఒక ఊహ కాదు.. ఒక సజీవ ప్రేరణ అని భరోసా ఇస్తుంది. రామరాజ్యం అంటే సత్యం, న్యాయ పాలన, ప్రజల సంక్షేమం, రాజు నిరంతర సేవ అని ఈ న్యాయస్థానం మనకు గుర్తు చేస్తుంది. నేడు రామ భక్తులు ఈ రామ దర్భార్ లోకి అడుగు పెట్టినప్పుడు వారు త్రేతా యుగం అంటే స్వర్ణయుగానికి చేరుకున్నట్లుగా ఉంటుంది. ఇక్కడ రాముడి పేరు ప్రతి దిశలో ప్రతిధ్వనిస్తుంది. కనుక రండి, అయోధ్య ధామ్ , రాముడి న్యాయస్థానాన్ని చూడండి. ఇది కేవలం ఒక దర్శనం కాదు.ఇది ఒక యుగం అనుభవం. రామరాజ్యం వైపు మొదటి అడుగు ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..