- Telugu News Photo Gallery Spiritual photos Nepal's Hidden Wonder Budhanilkantha Temple: Mystery Related To Raj Pariwar Curse
Budhanilkantha Temple: ఈ ఆలయంలోకి రాజ కుటుంబానికి నో ఎంట్రీ.. విష్ణువుకి పూజ చేస్తే మరణం తధ్యమట..
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రసిద్ధ హిందూ దేవాలయాలు ఉన్నాయి. పొరుగు దేశమైన నేపాల్ హిందూ దేశం అన్న సంగతి తెలిసిందే. ఈ దేశంలో కూడా అనేక పురాతన, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు సందర్శిస్తారు. ఈ ఆలయాలలో చాలా మర్మమైన బుధనీలకంఠ ఆలయం కూడా ఉంది.
Updated on: May 29, 2025 | 7:48 PM

హిందులు అధికంగా ఉండే భారతదేశంలో మాత్రమే కాదు అనేక ఇతర దేశాల్లో కూడా ప్రసిద్దిగాంచిన హిందూ దేవాలయాలున్నాయి. పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా అనేక హిందూ దేవాలయాలున్నాయి. ఇక్కడ అనేక పురాతన, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాలను సందర్శించడానికి భారతీయులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. అలాంటి ఆలయాల్లో ఒకటి బుధనీలకంఠ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన మర్మమైన విషయాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి. ఈ ఆలయంలో ఏ సాధారణ పౌరుడైనా పూజలు చేయవచ్చు. కానీ నేపాల్ రాజకుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆలయంలో పూజలు చేయలేరు. ఈ మర్మమైన ఆలయం గురించి తెలుసుకుందాం...

బుధనీలకంఠ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం శివపురి కొండ మధ్యలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది. మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తూ ఉన్న విగ్రహం ఇక్కడ కొలువుదీరి ఉంటుంది. ఈ బుధనీలకంఠ ఆలయ ప్రధాన విగ్రహం నేపాల్‌లో అతిపెద్ద రాతి శిల్పంగా పరిగణించబడుతుంది. భారీ విష్ణుమూర్తి విగ్రహం 1300 సంవత్సరాలుగా నీటిపైనే తేలుతూనే ఉందట. ఈ పురాతన ఆలయం దాని అందం, అద్భుతాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రాజ కుటుంబానికి శాపగ్రస్తమైందని చెబుతారు. శాప భయంతో రాజకుటుంబం బుధనీలకంఠ ఆలయాన్ని సందర్శించదు.

ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన విష్ణువు విగ్రహాన్ని రాజకుటుంబానికి చెందిన ఎవరైనా సందర్శిస్తే.. రాజకుటుంబానికి ఉన్న శాపంతో పూజలు చేసిన వారు చనిపోతారని నమ్ముతారు. ఈ కారణంగా రాజకుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని సందర్శించరు. పూజలు చేయడానికి వెళ్ళరు. అయితే రాజకుటుంబం పూజించడానికి ఆలయంలో విష్ణువు రెండవ సారూప్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

బుధనీలకంఠ ఆలయంలో విష్ణువు నీటి కొలనులో 11తలల శేషు నాగుపై నిద్రిస్తున్న భంగిమలో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు. పాల సముద్రంలో విష్ణువు శయనించి ఉన్నట్టే కనిపిస్తుంది. ఆదిశేషువు 11 తలలతో పాన్పుగా ఉండగా.. విష్ణువు మూర్తి 4 చేతుల్లో సుదర్శన చక్రం, శంఖం, తామరపువ్వు, గద ఉంటాయి.

సర్పాలు చుట్ట చుట్టుకుని పాన్పులా ఉండగా.. వీటిపై విష్ణువు హాయిగా నిద్రిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో ఒక రైతు పనిచేచేసేవాడట. ఈ సమయంలో ఆ రైతుకు ఈ విగ్రహం కనిపించిందట. 13 మీటర్ల పొడవైన ఈ చెరువులో ఉన్న విష్ణువు విగ్రహం ఐదు మీటర్ల పొడవు ఉంటుంది. సర్పాల తలలు విష్ణువుకి గొడుగు పడుతున్న రూపంలో విగ్రహం ఉంటుంది.

ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శంకరుడి విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో విషం విడుదలైనప్పుడు శివుడు విశ్వాన్ని రక్షించడానికి హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు శివుడు గొంతులో మంటగా అనిపించడం ప్రారంభించిందట. ఆ వేడి తాళలేక శివుడు తన త్రిశూలంతో పర్వతాన్ని కొట్టి నీటిని బయటకు తీశాడట. ఈ నీటిని తాగి శివుడు తన దాహాన్ని తీర్చుకున్నాడు. గొంతులో మంటనుంచి ఉపశమనం పొందాడు. కొంతసేపు సేదతీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది శివుని త్రిశూలంతో కొట్టడం వలన వచ్చిన నీరు సరస్సుగా మారింది. ఇప్పుడు ఈ సరస్సును అంటే కలియుగంలో గోసాయికుండ అని పిలుస్తారు.

బుధనీలకంఠ ఆలయంలో ఉన్న ఈ చెరువు ప్రధాన నీటి వనరు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆగస్టులో శివుడికి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఈ సరస్సు కింద శివుని ప్రతిమ కనిపిస్తుందని చెబుతారు.



















