AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందల ఏళ్ల.. కోట్లాది హిందువుల ఆత్మాభిమానం.. ధర్మధ్వజంతో పూర్తైన ఆఖరిఘట్టం!

అయోధ్య అంటే ఏంటి? వేదంలో దీనికున్న నిర్వచనం.. ఎవరూ జయించలేనిది అని. అందుకే రామయ్య పూర్వీకులు తమ రాజ్యానికి అయోధ్య అని పేరు పెట్టుకున్నారు. అసలు రామాయణం జరిగి కోటి సంవత్సరాలకు పైనే అయి ఉంటుందని అంచనా. ఇక అయోధ్యాపురి ఇంకెన్నాళ్ల క్రితందో. ఏ ముహూర్తాన అయోధ్య అని పేరు పెట్టారోగానీ.. ఇప్పటికీ నిలిచే ఉందా నగరి.

వందల ఏళ్ల.. కోట్లాది హిందువుల ఆత్మాభిమానం.. ధర్మధ్వజంతో పూర్తైన ఆఖరిఘట్టం!
Begining Of New Era In Ayodhya
Balaraju Goud
|

Updated on: Nov 25, 2025 | 10:07 PM

Share

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 935వ సంవత్సరంలో అంటే 1528వ సంవత్సరం సెప్టెంబర్‌లో.. బాబర్ దగ్గర కమాండర్‌గా ఉన్న మీర్ బఖీ.. అయోధ్య ప్రజలకు ఓ ఆర్డర్ పాస్ చేశాడు. ఓ మసీదు కట్టబోతున్నాం అని. అప్పుడు ఉబికి వచ్చిందో కన్నీటి ధార. ఎప్పటిదాకా..! 2024 జనవరి 22 దాకా. అంటే.. 496 ఏళ్లు. హిందువుల కన్నీళ్లను తుడవడానికి దాదాపు 500 ఏళ్లు పట్టింది. ఆ బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున ఆ కన్నీటిధార ఆగింది. దేశంలోని ప్రతి ఊరు, ప్రతి వాడ సంబరాలు చేసుకుంది. పండగ జరుపుకుంది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు హిందువుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అయోధ్యపై ధర్మధ్వజం ఎగరేశారు కదా. అందుకు. గతేడాదే అయింది కదా వేడుకంతా. మరి.. ఈ ధర్మధ్వజం ఏంటి? సాధారణంగా.. మన ఇళ్లలో ఎవరైనా గర్భవతి అని తెలియగానే ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటుంది కదా. కొన్ని వారాలకు సీమంతోనయనం పేరుతో అట్టహాసంగా వేడుక చేస్తాం కదా. ఓ ప్రాణం పురుడు పోసుకుందన్న సంతోషం అది. అదే జరిగింది 2024 జనవరి 22న. ఇప్పుడు బిడ్డ బయటికొచ్చింది. ఇంకే స్థాయిలో సంబరాలు జరగాలి. ఆ సంబురమే జరుగుతోంది అయోధ్యలో. ధ్వజారోహణం. సుమారు 500 ఏళ్లుగా హిందూ జాతి.. తమ ఆత్మాభిమానం కోసం చేసిన పోరాటానికి ముగింపు పలికిన క్షణం. దానికే ఈ సంబరం. అయోధ్య ధామం నిర్మాణం సంపూర్ణం అయిందని చెప్పడమే ధర్మధ్వజానికి అర్ధం. దాన్ని ఇంత సింపుల్‌గా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి