AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వామ్మో యూనిట్ అనుకుని లోపలికి వెళ్ళి కంగుతిన్న పోలీసులు.. బయటపడ్డ కల్తీ నెయ్యి కార్ఖానా..!

నెయ్యి అంటే హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. మన ఇళ్లలో పూజల్లోనూ, పిల్లల అన్నంలోనూ, శుభకార్యాల వంటల్లోనూ ఉండే పవిత్ర రుచి. ఆ రుచిలో విషం కలిపితే.. అది కేవలం కల్తీ కాదు.. మనసుల మీద దాడి. తాజాగా హైదరాబాద్‌ మహానగరంలో మరో కల్తీ నెయ్యి దందా గుట్టురట్టు అయ్యింది. బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడులు నిర్వహించారు.

Hyderabad: వామ్మో యూనిట్ అనుకుని లోపలికి వెళ్ళి కంగుతిన్న పోలీసులు.. బయటపడ్డ కల్తీ నెయ్యి కార్ఖానా..!
Hyderabad Adulterated Ghee Unit Busted
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 8:11 PM

Share

నెయ్యి అంటే హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. మన ఇళ్లలో పూజల్లోనూ, పిల్లల అన్నంలోనూ, శుభకార్యాల వంటల్లోనూ ఉండే పవిత్ర రుచి. ఆ రుచిలో విషం కలిపితే.. అది కేవలం కల్తీ కాదు.. మనసుల మీద దాడి. తాజాగా హైదరాబాద్‌ మహానగరంలో మరో కల్తీ నెయ్యి దందా గుట్టురట్టు అయ్యింది. బంజారాహిల్స్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ ,మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్ నెంబర్ 12 బోలానగర్‌లో ఉన్న ప్రైడ్ డెయిరీ యూనిట్‌ను సీజ్ చేసిన అధికారులు. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.

నెయ్యి అంటే మన ఇళ్లలో పూజలోనూ, పిల్లల అన్నంలోనూ, శుభకార్యాల వంటల్లోనూ ఉండే పవిత్ర రుచి. ఆ రుచిలో విషం కలిపితే.. అది కేవలం కల్తీ కాదు.. మనసుల మీద దాడి. బంజారాహిల్స్ రోడ్ నెం.12, భోలా నగర్‌లో ప్రైడ్ డెయిరీ పేరుతో నడుస్తున్న యూనిట్‌లో అలాంటి దందా సాగుతున్నట్టు బయటపడింది. టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి యూనిట్‌ను సీజ్ చేశారు. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ (26) ను అరెస్ట్ చేశారు. దాడిలో 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల మిశ్రమ నెయ్యి, 2,090 కిలోల ఆవు పాల మీగడ, 1,170 కిలోల గేదె పాల మీగడ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు వనస్పతి డబ్బాలు, ఆయిల్ ప్యాకెట్లు, బాయిలర్లు, ప్యాకింగ్ యంత్రాలు, తూకం యంత్రాలు, గ్యాస్ సిలిండర్లు, డ్రమ్‌లు, కవర్లు సీజ్ చేశారు.

అక్కడ సిట్యువేషన్ చూసినప్పుడు ఇది చిన్న యూనిట్ కాదు.. పద్ధతిగా నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్ అని తెలుసుకుని పోలీస్ అధికారులే కంగుతిన్నారు. యూనిట్‌కు లైసెన్స్ ఉన్నప్పటికీ తక్కువ నాణ్యత గల పామ్ ఆయిల్, వనస్పతి వంటి పదార్థాలను మీగడలో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దాన్ని అసలైన నెయ్యిగా చూపిస్తూ హోటళ్లు, శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్టు బయటపడింది. మన పిల్లల ఆరోగ్యం, మన పెద్దల నమ్మకం.. ఇవి లాభం కోసం పణంగా పెట్టినట్టు కనిపిస్తోంది.ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో BNS 318(4), 274, 275 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు దాడిని నిర్వహించారు. దాడుల్లో అరకొర వెలుగు చూస్తున్న ఘటనలు ఇవి. కనిపించని దారుణాలు ఎన్నో. తాగేది, తినేది ప్రతిదీ అవ్వడంతో.. జనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us