AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి

మెదక్ జిల్లాలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. బుక్ చేసినా గ్యాస్ రావడం లేదంటూ.. రోజుల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సామాన్యుల సహనం నశించింది. ఇక లాభం లేదని శివంపేట మండలం దొంతిలో గ్రామస్తులు అధికారుల తీరుపై కన్నెర్ర జేశారు. గ్రామానికి వచ్చిన గ్యాస్ ఆటోను అడ్డుకుని, బలవంతంగా సిలిండర్లు తీసుకెల్లారు.

Telangana: గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారో చూడండి
Medak Gas Crisis
P Shivteja
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 6:15 PM

Share

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా చాలా దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఓ పక్క దేశంలో పుష్కలంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. రియార్టీలో మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ఎంత వేయిట్ చేసినా గ్యాస్ దొరకకా.. రోడ్లపై కనిపించిన సిలిండర్లను ఎత్తుకెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. శివంపేట మండలం దొంతి గ్రామస్తులు గత కొంతకాలంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో అల్లాడిపోతున్నారు. సకాలంలో గ్యాస్ అందక, పొయ్యి వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే 40 సిలిండర్లతో గ్రామానికి వచ్చిన డెలివరీ ఆటోను గ్రామస్తులు చుట్టుముట్టారు. బుక్ చేసినా తమకు గ్యాస్ ఇవ్వడం లేదని, కానీ కొందరికి మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. డెలివరీ బాయ్స్ కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆటోలోని 40 సిలిండర్లను మహిళలు, గ్రామస్తులు బలవంతంగా లాక్కెళ్లారు.

వీడియో చూడండి..

తాము బుక్ చేసినా రారు కానీ.. బ్లాక్‌లో ఎలా అమ్ముతారు అంటూ నిలదీసారు. సకాలంలో సరఫరా చేయాల్సిన ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కష్టాలు తీర్చాలని దొంతి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us