AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం

పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం

Phani CH
|

Updated on: Mar 04, 2026 | 8:13 PM

Share

నగర అభివృద్ధి పేరుతో సాగుతున్న సైదాబాద్-సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జి పనులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు, వాహనదారులు భారీ ప్రమాదాల అంచున ఉన్నారు. హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేవు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగం తక్షణమే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

నగర అభివృద్ధి పేరుతో సాగుతున్న పనులు సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని సైదాబాద్ నుండి సంతోష్ నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. నిర్మాణ రంగంలో పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగిస్తున్న భారీ ఐరన్ మెటీరియల్‌ను సరైన రక్షణ కవచాలు లేకుండా పైభాగంలో అమర్చుతున్నారు. కింద నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పైనుంచి చిన్న ఇనుప ముక్క జారి పడినా కింద వెళ్లే వాహనదారుల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని జనం భయపడుతున్నారు. నిర్మాణ ప్రాంతంలో ఉండాల్సిన హెచ్చరిక బోర్డులు గానీ, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ప్రయాణికులే కాదు, అక్కడ పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఎంతో ఎత్తులో పని చేస్తున్నప్పటికీ వారు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భారీ క్రేన్లు, ఐరన్ లోడ్‌లతో పనులు జరుగుతున్నా.. కనీస బారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నగర అభివృద్ధి అవసరమే, కానీ అది ప్రజల ప్రాణాల మీదకు రాకూడదు. ఏదైనా జరగకూడనిది జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందే మేల్కొని కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మరియు ట్రాఫిక్ విభాగం తక్షణమే ఈ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతను నిర్ధారించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే

ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం

Follow Us