AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

బుడం దోసకాయలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కువగా అడవులలో దొరుకుతాయి. అయితే, వీటితో ఎండుచేపల కూర వండుకుని తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 5:37 PM

Share
కావల్సిన పదార్దాలు: 150 గ్రాములు ఎండుచేపలు, బుడం దోసకాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, పసుపు కారం, మసాలా పొడిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా  ఎండుచేపలను నీటిలో నానబెట్టి, ఆ తర్వాత పసుపు నీటితో కడిగి బాగా శుభ్రం చేసి ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు బుడం దోసకాయలను తీసుకుని తొక్క తియ్యకుండా వాటిని చిన్న ముక్కలుగా  కట్  చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పొయ్యి మీద పెట్టి దానిలో  ఆయిల్ వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి,కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి, తర్వాత దోసకాయ ముక్కలు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి.

3 / 5
దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వాటిలో ముందుగా క్లీన్ చేసిన ఎండుచేపలు, ఒక కప్పు చింతపండు రసం పోసి బాగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు  మూత పెట్టి బుడం దోసకాయ, ఎండు చేపలు ఉడికేవరకు స్టవ్ మీదే ఉంచాలి. చివర్లో  కొత్తిమీరను వేసి దించేయాలి. అంతే, బుడం దోసకాయ ఎండు చేపలు రెడీ.

5 / 5
Follow Us