AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా.

సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!
Ayodhya Sri Ram Temple Model
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: May 22, 2025 | 10:11 AM

Share

అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ళ ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. నెల రోజులపాటు ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది.

విశాఖ సాగరతీరం జైశ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది. అయోధ్య రామ మందిరం నమూనా ఆకట్టుకుంటుంది. సనాతన ధర్మం రామ తత్వాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ నమూనా రామ మందిరాన్ని నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రారంభించారు. అయోధ్య రామ మందిర బాల రాముని ప్రతిష్ట చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతి కలిగేలా ఈ సెట్ కు రూపకల్పన చేశారు. 90 అడుగుల ఎత్తు తో అయోధ్య రామ మందిరం లో ఉన్న 392 స్తంభాలు, 44 ద్వారాలతో ఈ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. రెండు నెలలుగా ఐదుగురు ఇంజనీర్లు 15 మంది ఆర్కిటెక్స్ 325 మంది సిబ్బందితో ఈ రామ మందిరం నమూనాన్ని సిద్ధం చేశారు. ఎక్కడా ఇనుము, సిమెంట్ వాడకుండానే అద్భుతంగా నమూనా రామన్ మందిరాన్ని తీర్చిదిద్దారు. అయోధ్యలో ఆలయం ఏరకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు గోపురాలు నిర్మించారు. చక్కటి విద్యుత్ దీపాలు అలంకరించారు.

గురువారం(మే 22) ఉదయం 8:48 గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ అయోధ్య రామ మందిర నమూనా ప్రారంభమైంది. బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ పక్కనే ఉన్న అనుమొల్ విల్లా స్థలంలో శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేశారు. రెండు నెలలపాటు ఈ నమూనాను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు నిర్వాహకులు. మహా కుంభమేళాలో మొదటిసారిగా ఈ నమూనా ప్రదర్శనను పెట్టారు. రెండో ప్రదర్శనగా విశాఖను ఎంచుకున్నారు. అయోధ్య రామ మందిరం నమూనా రాత్రిపూట చక్కటి విద్యుత్ దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అలరిస్తోంది.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..