AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: రాహు, కేతులు ఎవరు? జాతకంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు? ఎవరికీ భయపడతారంటే

జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలు రెండూ స్వభావరీత్యా క్రూరమైనవిగా పరిగణించబడతాయి. ఈ రెండు గ్రహాల తిరోగమన ఉద్యమానికి ప్రసిద్ధి చెందారు. రాహువు, కేతువు ఛాయా గ్రహాల వర్గంలోకి వస్తారు. ఈ రాశి మే 18న ఈ రెండు గ్రహలు తమ రాశిని మార్చుకోనున్నాయి. రాహువుకి మొండెం ఉండదు..కేవలం తల మాత్రమే ఉంటుంది. కేతువుకు మొండెం ఉంటుంది కానీ తల ఉండదు. రాహువు, కేతువుల జాతకం ప్రభావమ ఏమిటో తెలుసుకుందాం.

Astro Tips: రాహు, కేతులు ఎవరు? జాతకంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు? ఎవరికీ భయపడతారంటే
Rahu Ketu Transit May 2025
Surya Kala
|

Updated on: May 22, 2025 | 8:17 AM

Share

మే 18 ఆదివారం రోజున రాహువు, కేతువు రాశులను మార్చుకున్నారు. ఇవి రెండూ ఛాయా గ్రహాలు. వీటికి సొంత రాశి లేదు. అయితే తిరోగమనం చెందిన తర్వాత ఇవి ప్రతి రాశిలో 18 నెలల పాటు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రాహు, కేతు దుష్ట ప్రభావాలకు భయపడతారు. అందరినీ భయ పెట్టె ఈ ఇద్దరూ ఒకరికి భయపడతారు. అతను ఎవరో కాదు శ్రీ మహా విష్ణువు. రాహు, కేతుతులనే రెండు భాగాలుగా విభజించింది శ్రీ మహా విష్ణువు.

రాహు కేతువులు ఎవరంటే

మత గ్రంథాలు, పురాణాల ప్రకారం రాహు కేతుల అసలు పేరు స్వర్భాను. రాహువు తల్లి పేరు సింహిక. తండ్రి పేరు విప్రచట్టి. రాహువు తల్లి సింహిక హిరణ్యకశిపుని కుమార్తె. రాహువుకు 100 మంది సోదరులు, ఒక సోదరి ఉన్నారు. సోదరి పేరు మాహిష్మతి. స్వర్భాను 100 మందిలో పెద్దవాడు. క్షీర సాగర మథనం తరువాత స్వర్భాను రాహువు, కేతువుగా మారాడు.

ఇవి కూడా చదవండి

రాహువు కేతువుగా ఎలా మారాడంటే

సముద్ర మథనం నుంచి అమృతం వెలువడిన తర్వాత అమృతం కోసం దేవతలు , రాక్షసుల మధ్య వివాదం చెలరేగింది. అప్పుడు శ్రీ మహా విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతని అందానికి ఆకర్షితులై.. దేవ దానవులు అందరూ మోహిని దేవి మాట వినడం ప్రారంభించారు. మోహిని పథకం ప్రకారం అమృతం పంచేందుకు దేవతలను , రాక్షసులను వేర్వేరు వరుసల్లో కూర్చోబెట్టింది. రాక్షసులకు ద్రాక్షారసం ఇచ్చి, దేవతలకు అమృతం ఇవ్వడం ప్రారంభించింది.అయితే మోహినీ చేస్తోన్న మోసాన్ని గ్రహించిన స్వర్భానుడు దేవుడి రూపం దాల్చి సూర్యుడికి, చంద్రుడికి మధ్య కూర్చున్నాడు. ఈ విషయన్ని గ్రహించిన సూర్యచంద్రులు మోహినికి సైగ చేసి చెప్పారు. వెంటనే శ్రీ మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భానుడి తలను ఖంచాడు. అయితే అప్పటికే స్వర్భానుడు కొన్ని చుక్కల అమృతాన్ని తాగి ఉన్నాడు. సుదర్శన చక్రంస్వర్భానుడిని తల , మొండెం వేరుచేసినా అతను అమరత్వాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు స్వర్భానుడికి చాయ గ్రహంగా .. రాహు-కేతు హోదాను ఇచ్చాడు. స్వర్భానుడి తల భాగం రాహువుగా, మొండెం కేతువుగా మారింది.

సూర్యుడు, చంద్రుల మధ్య శత్రుత్వం ఎందుకంటే

సూర్యచంద్రుల కారణంగానే స్వర్భానుడిని శ్రీ హరి శిక్షించాడు. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం నేటికీ రాహువు, కేతువులు సూర్యచంద్రుల మధ్య శత్రుత్వం ఉంది.

రాహువు ప్రభావం ఎలా ఉంటుందంటే

రాహువు భయంకరంగా కనిపిస్తాడు. నల్లగా ఉంటాడు. నల్లని దుస్తులు ధరించి మెడలో పూలమాల ధరించి ఉంటాడు. రాహువు సూర్యచంద్రులకు మాత్రమే కాదు కుజుడికి కూడా శత్రువు. రాహువు స్వతహాగా క్రూరమైన, దూకుడుగా ఉండే గ్రహం. రాహువు అశుభ ప్రభావ లక్షణాలు ఏమిటంటే రాహు ప్రభావం ఉన్న వారు .. వారి ఆలోచనలను కలుషితం చేస్తాడు. ఒత్తిడిని కలిగిస్తాడు. ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. అదే సమయంలో రాహువు ఎవరినైనా శుభ దృష్టితో చూస్తే ఆ వ్యక్తి సామాజికంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంటాడు. వాగ్ధాటిగా మాట్లాడతాడు. చురుకైన తెలివి తేటలు, పదునైన మనస్సు గలవాడిగా మారి ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు.

కేతువు ప్రభావాలు

కేతువును రహస్యమైన, అంతుచిక్కని గ్రహంగా పరిగణిస్తారు.కేతువు ముక్తి కారకుడు. బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు అశుభ ప్రభావం కారణంగా వ్యక్తి కోపంగా, కఠినంగా మారుతాడు. కేతువు శుభ ప్రభావంతో వ్యక్తి నిర్భయంగా మారుతాడు. ఎవరి జాతకంలోనైన కేతువు గురువుతో సంయోగం జరిగితే నిరు పేద కూడా పేదవాడిని రాజుగా మారతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు