AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sulaimani Tea: కేరళ స్పెషల్ సులైమాని టీ రెసిపీ.. భోజనం తర్వాత ఎందుకు తాగుతారో తెలుసా..

టీ లో అనేక రకాలున్నాయి. వాటిలో ఒకటి కేరళకు చెందిన సులైమాని టీ. దీనిని కేరళలో మలబార్ ప్రాంతంలో మొదట తయారు చేశారు. ఇపుడు ఈ టీ రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందింది. సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ టీని సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. ఈ రోజు సులైమాని టీ తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Sulaimani Tea: కేరళ స్పెషల్ సులైమాని టీ రెసిపీ.. భోజనం తర్వాత ఎందుకు తాగుతారో తెలుసా..
Sulaimani Chai
Surya Kala
|

Updated on: May 21, 2025 | 1:28 PM

Share

సులైమాని టీ కేరళకు చెందిన ఒక ప్రత్యేకమైన, రుచికరమైన టీ. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది కనుక దీనిని సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. దీనిని మలబార్ ప్రాంతంలో ప్రత్యేకంగా హైదరాబాదీ సులేమాని టీ అని పిలుస్తారు. ఇది సాధారణ టీ కంటే కొంచెం భిన్నమైన రుచిని అంటే తీపి, పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. పాలు లేకుండా తయారు చేసే సులైమాని టీని మిరియాలు, యాలకులు, స్టార్ పువ్వు, సోంపు వంటి మసాలాలతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన సులైమాని టీ బ్లాక్ టీ. భోజనం తర్వాత ఈ టీని తాగడం వలన హాయిని కలిగిస్తుంది.

సులైమాని టీ తయారు చేసే విధానం:

  1. ముందుగా మసాలా సిద్ధం చేయండి: మిరియాలు, యాలకులు, స్టార్ సోంపు, వంటి మసాలా దినుసులను సిద్ధం చేసుకోండి.
  2. టీ కోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని.. మసాలా దినుసులను వేసి మరిగించండి.
  3. మసాలాలు నీటిలో బాగా మరిగించిన తర్వాత టీ ఆకులు వేసి బాగా మరిగించండి.
  4. ఇప్పుడు ఈ నీరు బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లం లేదా పంచదార వేసి కరిగించండి. (చక్కెరకు బదులుగా తేనె లేదా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు)
  5. ఇవి కూడా చదవండి
  6. చివరిగా తులసి ఆకులు, నిమ్మరసం పిండి.. అప్పుడు టీని వడగట్టి.. గ్లాసులో పోసి అందించండి.
View this post on Instagram

A post shared by Rahul Gamasta (@gmastagram)

సులైమాని టీ ప్రయోజనాలు: ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. సుగంధాలు ఉండడం వలన భోజనం తర్వాత ఈ టీని తాగడం వలన హాయిని కలిగిస్తుంది. సులైమాని టీని కేరళలో ఆతిథ్యానికి ఒక సంప్రదాయంగా భావిస్తారు. ఇది స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తమ భావాలను ఈ టీతో పంచుకుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)