మునగ ఆకులతో ఇంత మ్యాజిక్ ఉందా..? అస్సలు మిస్ కావొద్దు..!
బరువు తగ్గాలనుకునేవారికి మునగాకుపొడి మంచిది. గాయలను త్వరగా మానేలా చేయడంలో మునగాకు ముందు వరుసలో ఉంటుంది. మునగాకులో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగ ఆకును చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజల నుంచి తీసిన నూనెను కొన్ని రకాల వ్యాధులను అదుపు చేసేందుకు వాడుతారు.

మునగకాయ ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసిందే..కానీ, మునగ ఆకుల వల్ల కలిగే లాభాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మునగ ఆకుల ప్రయోజనం తెలిస్తే మాత్రం అందరూ వాటి వినియోగాన్ని మొదలుపెట్టడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకు ప్రయోజనాలు, ఆరోగ్య లాభాలేంటో తెలిస్తే చిన్న రెమ్మ కూడా వదిలకుండా దాచుకుంటారు..ఎందుకంటే.. మునగ ఆకులో విటమిన్లతోపాటుగా లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. పోషకలేమితో బాధపడేవారికి మునగ ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మునగాకులో ఉండే 46 రకాల సహజ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, కాలేయ సంబంధ వ్యాధులు, అల్జీమర్స్‌ను అదుపు చేస్తాయి. కీళ్లనొప్పులు తగ్గించడంలోనూ మునగాకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి మునగాకుపొడి మంచిది. గాయలను త్వరగా మానేలా చేయడంలో మునగాకు ముందు వరుసలో ఉంటుంది. మునగాకులో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగ ఆకును చేర్చుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మునగాకు జీర్ణక్రియకు సాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడలోనూ ఉపయోగపడుతుంది. మునగ కాయ, ఆకు మాత్రమే కాదు.. ఎండిన మునగ గింజల పొడి శరీరంలోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఈ గింజల నుంచి తీసిన నూనెను కొన్ని రకాల వ్యాధులను అదుపు చేసేందుకు వాడుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








