Daily Walking: రోజూ వాకింగ్ చేస్తున్నారా..? ఇలా నడిస్తేనే ప్రయోజనం..
నడక ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా రోజూ 45-60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నడవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వారానికి కనీసం 300 నిమిషాలు అంటే 5 గంటలు చురుకుగా ఉండటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంపూర్ణ ఆరోగ్యం కోసం సరైన ఆహారంతో పాటు తగినంత శారీరక శ్రమ కూడా తప్పనిసరి అని వైద్యులు తరచూ చెబుతుంటారు. అందుకే ప్రస్తుతం చాలా మంది వాకింగ్‌ను ఎంచుకుంటున్నారు. వ్యాయామం చేయలేకపోయినా, పరిగెత్త లేకపోయినా కొన్ని నిమిషాలు నడవడం వల్ల మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం చాలా ఈజీ.. నడకకు ఎక్కువ శ్రమ లేదా సమయం అవసరం లేదు. అయితే, మీరు రోజుకు ఎంత సేపు నడుస్తున్నారో ఎప్పుడైనా గమనించారా..? ఎంత సమయం వాకింగ్ చేయటం ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుంది. బరువు తగ్గేందుకు కూడా వాకింగ్ బెస్ట్ ఆప్షన్. డయాబెటిస్, బీపీ తగ్గించడంలో కూడా వాకింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ నడక వల్ల గుండె ఆరోగ్యం మెరగవుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే, రోజువారీ వాకింగ్ వ్యక్తిగత ఆరోగ్యం, ఫిట్‌నెస్ స్థాయి, జీవనశైలి కారకాల ఆధారంగా మారుతుంది. సాధారణ ఆరోగ్య ప్రయోజనాల కోసం, వారంలో…చాలా రోజులు కనీసం 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నడకను మన దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నడకతో పాటుగా చిన్నపాటి వ్యాయామాలతో శరీరాన్ని సాగదీయడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. వాకింగ్‌తో కేలరీలను బర్న్ చేయడంలో, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నడవడం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం లేదా భోజన విరామ సమయంలో నడకకు వెళ్లడం మీ దినచర్యలో భాగం చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నడక ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా రోజూ 45-60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నడవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వారానికి కనీసం 300 నిమిషాలు అంటే 5 గంటలు చురుకుగా ఉండటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








