Pink Salt Benefits: పింక్ సాల్ట్ వాడుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
ఈ రకమైన ఉప్పులోని ఖనిజాలు శరీరం నుండి విషాన్ని బయటకు పంపి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలిచే ఈ ఉప్పులోని మెగ్నీషియం కంటెంట్ కండరాలు, నరాలను సడలించడానికి సహాయపడుతుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.

సాధారణంగా మనందరం వాడే ఉప్పు వైట్ కలర్‌లో ఉంటుంది. దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఈ తెల్ల ఉప్పునే ఎక్కువగా వాడుతుంటారు. కానీ, పింక్ సాల్ట్ గురించి మీకు తెలుసా..? అదే హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది సహజంగా గులాబీ రంగులో ఉంటుంది. ఇది సాధారణ సాల్ట్ తో పోలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ పింక్ సాల్ట్ ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పింక్ సాల్ట్ ఉప్పులో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. టేబుల్ ఉప్పు కంటే ఎక్కువ కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం ఈ పింక్ సాల్ట్‌లో ఉన్నాయని చెబుతున్నారు.. ఈ రాతి ఉప్పు జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయడానికి సహాయపడుతుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. పింక్ ఉప్పు జీర్ణక్రియ కోసం ద్రవ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, అవసరమైన పోషకాలను బాగా గ్రహించడానికి, కొవ్వు నిల్వను నివారించడానికి సహాయపడుతుంది.
వెచ్చని నీటితో కలిపినప్పుడు, పింక్ ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది, ఇది నిర్జలీకరణం, అలసటను నివారిస్తుంది, ఇది తరచుగా బరువు పెరగడంతో సంబంధం కలిగి ఉంటుంది. పింక్ సాల్ట్‌లో పొటాషియం, కాల్షియం,మెగ్నీషియంతో సహా 84 ఖనిజాలు ఉంటాయి. ఈ రకమైన ఉప్పులోని ఖనిజాలు శరీరం నుండి విషాన్ని బయటకు పంపి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అని పిలిచే ఈ ఉప్పులోని మెగ్నీషియం కంటెంట్ కండరాలు, నరాలను సడలించడానికి సహాయపడుతుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








