Vegetables: ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు ఇవే.. ఇకపై ఆ తప్పు చేయకండి..!
కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి దాదాపు మనందరం ఫ్రిజ్ లో నిల్వ చేస్తూ ఉంటాము. అయితే ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఈ విషయం తెలియక ఎంతో మంది వీటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ, ఇలా చేయటం అనర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి కూరగాలేంటి.. వాటిని ఎందుకు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

గుమ్మడికాయ, సొరకాయ వంటి కూరగాయలను ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే టమాటాలు కూడా.. టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద గాలి పీల్చేలా ఉంచడం మంచిదని చెబుతున్నారు.. ఫ్రిజ్ లో నిల్వ చేయటం వల్ల వాటి నాణ్యత, రుచి తగ్గుతుందని చెబుతున్నారు. ఇకపోతే, సాధారణంగా ఉల్లిగడ్డలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదని చెబుతున్నారు. ఉల్లిగడ్డ గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఉంచితే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్ లో పెడితే ఉల్లిపాయ మృదువుగా మారుతుంది. అందులో ఫంగస్ కూడా పెరుగుతుంది.
వంకాయలు కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదని అంటున్నారు. వంకాయ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని రుచి తగ్గుతుందని చెబుతున్నారు. గది ఉష్ణోగ్రత అనేది వంకాయను ఉంచాల్సిన ప్రదేశం. అలాగే, వెల్లుల్లి కూడా. వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే మొలకెత్తుతుంది. వెల్లుల్లిని గది వాతావరణంలో ఉంచాలి. అప్పుడే అది ఎక్కువ కాలం అలాగే ఉంటుంది. బంగాళదుంపను ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచితే దాని తొక్క నల్లగా మారుతుంది. కాబట్టి వాటిని ఫ్రిజ్ లో పెట్టకండి. ఎరుపు, ఆకుపచ్చ ల మిరపకాయలను ఫ్రిజ్ లో ఉంచకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..