AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 దాటినా యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? నీటిని సరైన పద్ధతిలో తీసుకోండి

చాలా మంది కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు.. కానీ, ఇది సరైనది కాదు.. చాలా చల్లని లేదా వేడి నీరు చర్మానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందిని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం గోరువెచ్చని లేదంటే గది ఉష్ణోగ్రత నీటిని తీసుకోవడం వల్ల పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చెబుతున్నారు.. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.

40 దాటినా యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? నీటిని సరైన పద్ధతిలో తీసుకోండి
Drinking Water
Jyothi Gadda
|

Updated on: May 20, 2025 | 8:16 PM

Share

నీళ్లు శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ ఎక్కువ నీళ్లు తాగుతాం.. అయితే ఈ నీటిని సరైన విధానంలో తాగితే యవ్వనంగా కూడా ఉంటామని మీకు తెలుసా..?ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ, ఇదే నిజం అంటున్నారు నిపుణులు. నీళ్లు తాగడమే కాదు.. దానిని సరైన పద్ధతి ప్రకారం తీసుకుంటే మీరు 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల చిన్నవారిలా కనబడతారని అంటున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉదయం నిద్ర లేవగానే ఒక పెద్ద గ్లాసులో గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి, శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు. రాత్రంతా శరీరం డిటాక్స్ మోడ్‌లో ఉంటుంది. ఒంట్లో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడానికి నీళ్లు చాలా అవసరం. నెమ్మదిగా నీరు తాగడం వల్ల మెరిసే చర్మం మీ సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని రోజుకు ఒక్కసారైనా తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, రాగి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇది శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం, కడుపులో మంటను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నీటిలో పుదీనా, నిమ్మకాయ, దోసకాయ లేదా కొన్ని బెర్రీ ముక్కలను కలిపి ‘డిటాక్స్ వాటర్’ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మీ ముఖం కాంతిని తిరిగి తీసుకురావడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా రోజంతా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు.

చాలా మంది కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు.. కానీ, ఇది సరైనది కాదు.. చాలా చల్లని లేదా వేడి నీరు చర్మానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత నీరు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చెబుతున్నారు.. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇక కడుపు ఉబ్బరం వల్ల చర్మం మెరుపు కూడా తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us