AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భవతులు కాఫీ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కాఫీ అంటే పిచ్చి.. దాదాపు ప్రతి ఒక్కరికి కాఫీ వాసన బాగా ఇష్టం..ఒక కప్పు కాఫీ లేకుండా కొందరికీ రోజు గడవదంటే నమ్మాల్సిందే..! కాఫీ తాగటం వల్ల ఒక రకమైన శక్తి వస్తుంది. కొంతమందికి, కాఫీ లేకుండా రోజు ప్రారంభం కాదు. వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ మజానే వేరు అంటుంటారు. కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్న వెంటనే కప్పు కాఫీ లాగించేయాల్సిందే అంటారు. అయితే, గర్బిణీలు కాఫీ తాగొచ్చా..? ఇది వారి ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం...

గర్భవతులు కాఫీ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Is drinking coffee good for pregnant women and is it bad for them
Jyothi Gadda
|

Updated on: May 17, 2025 | 9:29 PM

Share

చాలామంది గర్భిణీలు కూడా కాఫీ అంటే ఇష్టంగా తాగుతుంటారు. గర్భిణీలు శిశువు పెరుగుదలకు అవసరమైన, తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లు మానేయాల్సి ఉంటుంది. అయితే, కాఫీలోని కెఫిన్ సురక్షితమేనా కాదా అనే విషయంలో చాలా మందికి అయోమయం ఉంటుంది. అయితే, గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల శిశువు ఆరోగ్యానికి సమస్యలు వస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

గర్భధారణ సమయంలో సిఫార్సు చేయబడిన స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల, జీవక్రియ గణనీయంగా మందగిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. తద్వారా అది తన చర్యను విస్తరిస్తుంది. దీనివల్ల తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాఫీలో యాంటీహైపర్‌టెన్సివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది నాడీ, జీర్ణ, హృదయ, మూత్రపిండ వ్యవస్థల కార్యకలాపాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

అధిక కెఫిన్ వినియోగం గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ జననం లేదా అకాల పుట్టుక ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలలో కెఫీన్ నిద్రలేమి, ఆందోళన లేదా క్రమరహిత హృదయ స్పందనకు కారణమవుతుంది. గర్భధారణ సమయంలో శరీరం కెఫిన్‌ను నెమ్మదిగా ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి అది శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది. తల్లి తీసుకునే కెఫిన్ పరిమాణం నవజాత శిశువులోని జుట్టుపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే కెఫిన్ లేని కాఫీ మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. కాఫీకి బదులుగా, హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు, సరిపడా మంచినీళ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..