AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడి హనుమంతుడి ఆలయంలో ముస్లింలే పూజారులు..ఊరంతా భక్తులే..! ఎక్కడో తెలుసా..?

ప్రజల్లో సోదరభావం, మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు, ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెబుతారు. కోరికొప్పలో హిందువులు, ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నాదమ్ముల వలే కలిసి జీవిస్తున్నారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

అక్కడి హనుమంతుడి ఆలయంలో ముస్లింలే పూజారులు..ఊరంతా భక్తులే..! ఎక్కడో తెలుసా..?
Hanuman Temple
Jyothi Gadda
|

Updated on: May 17, 2025 | 7:44 PM

Share

దేవాలయాల్లో ముస్లీంలు పూజారులుగా ఉన్న ఆలయాన్ని మీరు ఎక్కడైనా చూశారా..? అదేంటి హిందూ ఆలయాల్లో ముస్లిం పూజారులా..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. కానీ, ఇది నిజంగానే జరుగుతోంది. కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలోని లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లీంలు పూజారులుగా ఉన్నారు. గత 150 సంవత్సరాలకు పైగా ఇక్కడి హనుమాన్‌ ఆలయంలో ముస్లిం కుంటుబాలు మాత్రమే పూజారులుగా కొనసాగుతూ వస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది.. అదేంటో తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లా్ల్సిందే..

కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ సమీపంలోని కొరికొప్ప హనుమాన్ ఆలయంలో గత 150 సంవత్సరాలుగా ముస్లింలే పూజారులుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇది హిందూ సోదరులు వారికి ఇచ్చిన ప్రత్యేక హక్కుగా తెలిసింది. ఎందుకంటే..ఒకప్పుడు కలరా వ్యాధి వచ్చినప్పుడు గ్రామస్తులంతా వెళ్లిపోయారట. ముస్లీం కుటుంబాలు మాత్రం అక్కడే ఉండి హనుమంతుడిని పూజించాయట. ఆ తర్వాత వ్యాధి తగ్గడంతో ముస్లీంలు ఆలయ పూజ బాధ్యతలు చేపట్టారట. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

దీనిని బట్టి చూస్తే.. కోరికొప్ప గ్రామ పెద్దలు సోదరభావం, మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఆనాటి నుండి ముస్లింలు పూజలు, ఇతర ఆచారాలను నిర్వహించడానికి అనుమతించారని చెబుతారు. కోరికొప్పలో హిందువులు, ముస్లింలు ఎల్లప్పుడూ శాంతియుతంగా అన్నాదమ్ముల వలే కలిసి జీవిస్తుంటారని, ఈ గ్రామంలో ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రత్యేక రోజులు, పండుగల సమయాల్లో కుల, మత విభేదాలు లేకుండా గ్రామస్తులంతా కలిసి ఆలయంలో పూజాది కార్యక్రమాలకు హాజరవుతుంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు