పట్టులాంటి చర్మానికి పాల మీగడ…ఇలా వాడితే మిలమిలలాడే అందం మీ సొంతం..!
ఎండాకాలంలో చర్మ సంరక్షణ తప్పనిసరి. ఎండలు, చెమట కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ సమస్యని దూరం చేయడానికి ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా పాలమీగడ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. పాలమీగడ అనేది చర్మానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి మీగడ రాస్తే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి.
Updated on: May 17, 2025 | 4:58 PM

పాల నుంచి సేకరించిన మీగడలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో లాక్టిక్ ఆమ్లం, కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖానికి మీగడ రాస్తే చర్మం ఆరోగ్యవంతంగా, మృదువుగా మారుతుంది. పాలమీగడలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

పాల మీగడలోని పోషకాలు చర్మానికి పోషణను అందిస్తాయి. దీంతో చర్మం తేమగా ఉంటుంది. ఇందులో ఉన్న లాక్టిక్ ఆమ్లం, ఫ్యాటీ యాసిడ్స్ తేమను లాక్ చేస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. ముఖానికి మీగడను అప్లై చేయడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ముడతలు, ఫైన్‌లైన్స్ తగ్గుతాయి.

మీగడతో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. మీగడంలోని లాక్టిక్ యాసిడ్ చనిపోయిన మృతకణాలను తొలగిస్తుంది. మృదువైన చర్మాన్ని అందిస్తుంది. మీగడలో ఉండే కొవ్వులు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీగడ రాయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో చర్మ రంధ్రాల్లో చేరిన మురికి తొలగుతుంది. ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.

మీగడతో ముఖానికి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మం మరింత అందంగా, యవ్వనంగా మారుతుంది. ఇందుకోసం మీగడలో కొంచెం ఓట్స్ పొడి కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

పొడి చర్మం సమస్యతో బాధపడేవారు మీగడలో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల అదనపు తేమ లభిస్తుంది. చర్మం రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము, మృత కణాలు తొలగిపోతాయి మీగడ, ఓట్స్ లేదా బ్రెడ్డుతో కూడా కలిపి చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. బయటకు వెళ్లే ముందు చర్మానికి మీగడ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీగడ రాస్తే . సూర్యరశ్మిలోని ప్రమాదకర కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.




