పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా.. వధూవరుల పై నెటిజెన్స్ ఫైర్
పెళ్లి బరాత్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం అనేది ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. అంత వరకు ఒకే గానీ ఇక్కడో ఓ జంట అంతకంటే ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేశారు. పెళ్లి తర్వాత కొత్త జంట కారుపై స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా పెళ్లికొడుకు నిలబడి కత్తి విన్యాసం చేశాడు. పెళ్లి కూతురు కూడా ప్రమాదకరంగా కారు బానెట్‌పై కూర్చుని ఓ పాటకు డ్యాన్స్ చేసింది.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంట కదులుతున్న కారుపై విన్యాసాలు చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులు ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై నిల్చొన్న వరుడు తన చేతిలోని కత్తిని అటూ ఇటూ తిప్పాడు. పెళ్లికూతురు కూడా కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని‘ఇష్క్ కీ గలి విచ్ నో ఎంట్రీ’ పాటకు డ్యాన్స్ వేసింది. వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు యజమానిని కనిపెట్టి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్స్ మాత్రం వధూవరులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టులుపెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరిన్ని S-400లు కొనే యోచనలో భారత్ ??
అధిక బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!
ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !
ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ..

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
