Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !

ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !

Phani CH

|

Updated on: May 17, 2025 | 1:46 PM

ద్రాక్ష తినడానికి మాత్రమే కాదు.. ద్రాక్షలోని విత్తనాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవును జుట్టు పెరుగులకు ద్రాక్ష గింజలు బెస్ట్‌ మెడిసిన్‌గా పనిచేస్తాయి. విత్తనాల నుంచి తయారు చేసిన నూనె జుట్టుకు రాసుకోవడం వలన ఎన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి. మహిళలు తమ జుట్టు బాగా పెరగడానికి అవసరమైన నూనెలు , రకరకాల చిట్కాలను ఫాలో అయిపోతారు.

అయితే కొన్నిసార్లు అవి ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ప్రస్తుత ఒత్తిడి కాలుష్య వాతావరణంలో జుట్టు సంరక్షణ అంత సులభమేం కాదు. చాలా మంది రోజ్‌మేరీ లేదా కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. అయితే ఈ ఆయిల్స్ కు బదులుగా, ద్రాక్ష గింజల నూనె జుట్టుకి పోషకాలను అందిస్తుంది. ఈ ద్రాక్ష నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. గ్రేప్‌ సీడ్‌ ఆయిల్ జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని అందించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టును ఆరోగ్యంగా, మరింత బలంగా చేస్తుంది. ద్రాక్ష గింజల నూనె జుట్టు రాలకుండా కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. పొడి, గిరజాల జుట్టుకు పోషణను అందించడానికి అనువుగా ఉంటుంది. జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయే ఈ నూనె బలాన్ని అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది. ద్రాక్ష గింజల నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ముఖ్యంగా లినోలెయిక్ ఆమ్లం జుట్టు ఊడిపోవడాన్ని, జుట్టు చివర్లలో split ends తగ్గిస్తుంది. ద్రాక్ష గింజల నూనె తేమను తగ్గించడం ద్వారా చుండ్రును పోగొడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్‌ తయారీ..

చూయింగ్‌ గమ్‌ తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే

బెల్లంతో లవంగాలు కలిపి ఎప్పుడైనా తిన్నారా ??