చూయింగ్ గమ్ తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే
చాలా మందికి చూయింగ్ గమ్ నమలడం సరదానే కాదు అలవాటు కూడా. నోటి దుర్వాసనను తొలగించడానికి కొందరు రోజూ వీటిని తింటుంటారు. మరికొందరు ఏకాగ్రతను పెంచుకోవడానికి, ఆటగాళ్ళు అయితే టెన్షన్ నుంచి ఉపశమనం పొందడానికి చూయింగ్ గమ్ నములుతుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
ఇది దీర్ఘకాలం కొనకసాగితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. నిపుణుల ప్రకారం, చూయింగ్ గమ్‌లో మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయి. ఇది మెదడుకు చాలా హానికరం. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం చూయింగ్ గమ్‌లలో ప్లాస్టిసైజర్లు ఉంటాయి. ఈ పదార్ధాన్ని చూయింగ్ గమ్ ను ఫ్లెక్సిబుల్ గా ఉంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తారు. ఈ చూయింగ్ గమ్ నమలడం వల్ల దాదాపు 1 మిలియన్ మైక్రోప్లాస్టిక్ కణాలు నోటిలోకి ప్రవేశిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కడుపులోకి వెళ్లిన తర్వాత రక్తంలో కలిసిపోతాయి. అంతేకాదు, ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అవయవాలలో పేరుకుపోతాయి. ఇవి మెదడులో చేరి కాలక్రమేణా నాడీ కణాలను ప్రభావితం చేస్తాయి. ఎలుకలపై అధ్యయనం చేసిన పరిశోధకులు మైక్రోప్లాస్టిక్‌లకు గురికావడం వల్ల జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం తగ్గుతుందని గమనించారు. మెదడు చురుకుదనం క్రమంగా తగ్గుతుంది. మైక్రోప్లాస్టిక్‌లు చూయింగ్ గమ్‌లోనే కాకుండా వివిధ సౌందర్య సాధనాలు, బాటిల్ వాటర్, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో కూడా కనిపిస్తాయని వారు చెప్పారు. అయితే చూయింగ్ గమ్‌తో సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

