ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ..
అమెరికాలోని టిమోతీ ఫ్రైడ్ ... ఒకటీ రెండు సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 800 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు! గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా టిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు!
మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వీనమ్ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!! బ్లాక్‌మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఇదొకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న టిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లాన్‌విల్ ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. టిమోతీ ట్రక్ మెకానిక్‌గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. పదుల సంఖ్యలో పాములను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. తరచూ వాటి చేత కాటు వేయించుకున్నాడు. ప్రతీసారి కొద్ది మొత్తంలో విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. మొదటిసారి భయంతో బిగుసుకుపోయాననీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత నుంచి అలవాటైందనీ ఎలాంటి అలజడి లేకుండా దాదాపు 800 సార్లు కాటు వేయించున్నట్లు తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
