Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరిన్ని S-400లు కొనే యోచనలో భారత్‌ ??

మరిన్ని S-400లు కొనే యోచనలో భారత్‌ ??

Phani CH

|

Updated on: May 17, 2025 | 2:46 PM

ఇప్పుడు భారత్‌ చేతిలో సుదర్శన చక్రం ఉంది. పాకిస్తాన్‌ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా, వాటిని తుత్తునియలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్ర సొంతం. ఈ సుదర్శన చక్రం అసలు పేరు S-400 యాంటీ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. వీటిని మనం రష్యా నుంచి కొన్నాం. పాక్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే కూల్చేసింది.

అత్యంత శక్తివంతమైన ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ అదనపు యూనిట్స్‌ని రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాక్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. అనంతరం పాకిస్తాన్‌ భారత్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌ దాడికి ప్రయత్నించింది. ఆ సమయంలో సరిహద్దుల్లో మోహరించిన ఎస్‌-400 మిస్సైల్‌ సిస్టమ్‌ విజయవంతంగా అడ్డుకుంది. S-400 అనేది మొబైల్‌ మిస్సైల్‌ వ్యవస్థ. వాహనాల ద్వారా వీటిని ఎక్కడినుంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రత్యర్థుల జామింగ్‌ సిస్టమ్‌ని తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను అత్యంత కచ్చితత్వంతో నేల కూలుస్తుంది. భారత్‌ దగ్గర మొత్తం మూడు S-400 వ్యవస్థలు ఉన్నాయి. భారత్‌ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో తయారు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌లో ‘సుదర్శన్ చక్రం’గా పిలుస్తున్నారు. ఎస్‌-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు. ఒకేసారి మల్టిపుల్‌ టార్గెట్స్‌ని ధ్వంసం చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అధిక బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీకోసమే..!

ఒత్తైన జుట్టుకు ద్రాక్ష గింజల నూనె.. !

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్‌ తయారీ..

చూయింగ్‌ గమ్‌ తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే

బెల్లంతో లవంగాలు కలిపి ఎప్పుడైనా తిన్నారా ??