AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉబ్బసాన్ని ఊదిపారేస్తుంది.. ఉదయాన్నే ఇవి 4 ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..!

భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా భావించే తులసికి ఆయుర్వేదంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యూజినాల్‌ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. జీర్ణక్రియకు, గొంతు మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి, శరీరంలో మంటను తగ్గించడంలో తులసి ఉపయోగపడవచ్చని చెబుతారు. ఉదయాన్నే తులసి ఆకులు తీసుకోవడం లేదా తులసి కషాయం తాగడం సంప్రదాయంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి.

ఉబ్బసాన్ని ఊదిపారేస్తుంది.. ఉదయాన్నే ఇవి 4 ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..!
Tulsi Leaves Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2026 | 9:22 PM

Share

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు గ్రహ దోషాలు అంటవని పూర్వీకులు నమ్మేవారు. సాధారణంగా తులసి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఎర్ర పూలు పూసే చెట్టును కృష్ణ తులసి అని, తెల్ల పూలు పూసే చెట్టును లక్ష్మీ తులసి అని పిలుస్తారు. అయితే, తులసి చెట్టు పూజనీయమైనది మాత్రమే కాదు.. లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. తులసిలో విటమిన్లు ఎ, సి, కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దాగున్నాయి. దీంతోపాటు యూజినాల్ (Eugenol) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. అందుకే.. ఉదయాన్నే నాలుగు ఆకులు తినాలని లేదా ఒక స్పూన్ రసం తాగాలని సూచిస్తున్నారు.

మన పెరట్లోని తులసి చెట్టు అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం

తులసి ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణశక్తికి తులసి చాలా మంచి మందుగా చెప్పవచ్చు. నాలుగు తులసి ఆకులు, రెండు మిరియాలను మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా అన్నం తినకుండా మారాం చేసే చిన్న పిల్లలకు రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించడంలో..

శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. కఫంతో కూడిన దగ్గు, రక్తంతో కూడిన దగ్గు పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకు తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతి పూట తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు..

ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బసం నివారణకు ఉపయోగించే ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి

తులసిలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, శరీరంలో మంటను నివారించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

తులసి కడుపులోని క్రిములను పారదోలే శక్తిని కలిగి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది. తులసి తీర్థం ప్రాచీన కాలం నుండి ప్రాముఖ్యతను కలిగి ఉంది. అవసాన దశలో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయడంలో ఒక అర్థం ఉంది. వారి గొంతులో కఫం అడ్డుపడకుండా, శ్వాస సరిగా తీసుకోవడానికి అది సహాయపడుతుందని ఆ విధంగా చేస్తారు.

తులసి మొక్క నుండి తీయబడిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను పలు హెర్బల్ ఉత్పత్తుల్లో, మందుల్లో విస్తృతంగా వాడుతుంటారు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆహారాలలో, ఔషధాలలో కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నందున తులసిని నిజమైన సహజ సంజీవనిగా పరిగణించవచ్చు. రోజువారీ జీవితంలో తులసిని భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us