నల్ల తుమ్మ అని తక్కువగా అంచనా వేస్తున్నారా..? ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల ఔషధ మూలికలు, మొక్కలు, వృక్షాలు ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. అలాంటి ఔషధ గుణాలు కలిగిన చెట్లలో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. సాధారణంగా ఈ చెట్లను పంట పొలాలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు, వివిధ రకాల సామాగ్రి తయారీ కోసం ఉపయోగిస్తారు. కానీ, నల్ల తుమ్మలో ఎన్నో ఔషధ గుణాలను నిండి ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Updated on: May 20, 2025 | 4:10 PM

మన చుట్టు పక్కల సాధారణంగా కనిపించే చెట్లలో నల్లతుమ్మ చెట్టు ఒకటి. పసుపు రంగు పూలు, నల్లటి బెరడు, పొడవాటి కాయలు ఈ చెట్టుకు చూస్తాం. సర్వసాధారణంగా కనిపించే ఈ చెట్టులో అసాధారణమైన పోషక విలువలు, ఎన్నో రకాల రోగాల్ని నయం చేసే ఔషధ గుణాలు కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు ఎన్నో రోగాలను నయం చెయ్యడంలో సహాయపడుతుంది. ఈ చెట్టు నుండి వచ్చే కలప నుండి ఎన్నో రకాల వస్తువులు తయారు చేస్తారు. ఈ చెట్టు కాయలు సైతం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నల్ల తుమ్మ బెరడుతో పాటు దాని జిగురును, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ప్రతిరోజూ మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాల్లలో కలుపుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. నల్ల తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. దీనిలో తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ చేయాలి. ఇది తీసుకోవడం మగవారికి మంచిదని అంటున్నారు.

నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయటం వల్ల నోటిపూత, ఇతర నోటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ ఆకులను వాము, జీలకర్ర కలిపి కషాయంలా చేసుకుని తాగాటం వల్ల డయేరియా సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.




