- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal has been cast as Mandodari in Nitesh Tiwari's Ramayana
Kajal Aggarwal: నా పక్కన ఎవరున్నా బేఫికర్.. పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం తగ్గేదేలే
నాతో ఎవరున్నా బేఫికర్ అంటున్నారు నటి కాజల్. పక్కన ఎవరుంటే ఏంటి? నా సోలో పెర్ఫార్మెన్స్ తో నేను మెప్పించేస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది చందమామలో. రీసెంట్ టైమ్స్ లో ఆమె స్టోరీ సెలక్షన్‌ని గమనించిన వారు ఈ విషయం గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు. లాహే లాహే అంటూ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్‌లో కాజల్‌ని చూసిన వారందరూ ఆచార్యలో కాజల్ ఉన్నారనే అనుకున్నారు.
Updated on: May 20, 2025 | 3:55 PM

లాహే లాహే అంటూ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్‌లో కాజల్‌ని చూసిన వారందరూ ఆచార్యలో కాజల్ ఉన్నారనే అనుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యే సరికి ఈ అమ్మణికి స్పేస్ లేదనే విషయం అర్థమైపోయింది.

ఒకవేళ ఉంటే మాత్రం పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకునేవారే. ఆమెతో కాకపోయినా ట్రెండింగ్ హీరోయిన్లతో మాత్రం కలిసి కనిపించారు కాజల్. భగవంత్ కేసరిలో బాబాయ్ అమ్మాయిగా బాలకృష్ణ, శ్రీలీల కేరక్టర్లు చూసి ఫిదా అయ్యారు జనాలు.

స్క్రీన్ మీద వారిద్దరితో పాటు మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్స్ లో సందడి చేశారు కాజల్. బాలయ్య జోడీగా భగవంత్ కేసరి సక్సెస్‌ని షేర్ చేసుకున్నారు కాజల్. ఇండియన్2లోనూ యాక్ట్ చేశారు కాజల్. కాకపోతే థర్డ్ పార్ట్ కోసం కాజల్ పోర్షన్ దాచేశారు శంకర్. లేకుంటే రకుల్‌తో కలిసి కనిపించేవారే...

రీసెంట్‌గా సికిందర్‌లో రష్మిక అండ్ కాజల్ సెట్లో బోలెడన్ని ముచ్చట్లు చెప్పుకున్నారు. సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయాలన్నీ మరుగునపడ్డాయి. లేకపోతేనా.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో ఈ కహానీలు చాలానే వినిపించేవారు ఇద్దరు భామలు

ఇప్పుడు లేటెస్ట్ గా నార్త్ రామాయణ్‌లో మండోదరి పాత్రలో నటించనున్నారు కాజల్. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. సో కెమెరా ముందు తన పక్కన ఎవరున్నా సరే, తన పని తాను చేసుకుపోవడం కెరీర్ బిగినింగ్ నుంచే బాగా అలవాటైంది కాజల్‌కి అని మాట్లాడుకుంటున్నారు జనాలు.




