- Telugu News Photo Gallery Cinema photos Salman Khan may come with army genre movie know the details here
వరుస ఫ్లాపులతో దూసుకుపోతున్న సల్మాన్.. ఈ కాన్సెప్ట్ తో అయిన హిట్ దక్కేనా ??
రీసెంట్ పాస్ట్ లో సిల్వర్ స్క్రీన్‌ని రూల్ చేసిన సినిమాల్లో త్రివిధ దళాలకు సంబంధించిన సబ్జెక్టులు చాలానే ఉన్నాయి. సౌత్ లో అమరన్ నుంచి నార్త్ లో వార్2 వరకు.. ఈ హవానే కనిపిస్తోంది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఈ కాన్సెప్టునే ఓకే చేశారు సల్మాన్ భాయ్. అమరన్ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి కళ్లు తిరిగాయి ట్రేడ్ పండిట్స్ కి.
Updated on: May 20, 2025 | 3:45 PM

అమరన్ సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి కళ్లు తిరిగాయి ట్రేడ్ పండిట్స్ కి. ఆర్మీ బేస్డ్ మూవీని ఎమోషన్ తో తీస్తే, ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరవుతుందో ప్రూవ్ చేసింది అమరన్. ఈ తరహా సబ్జెక్టుతోనే సల్మాన్‌ని అప్రోచ్ అయ్యారట అమరన్ కెప్టెన్ రాజ్‌కుమార్ పెరియసామి.

అయితే రాజ్‌కుమార్ స్క్రిప్టును హోల్డ్ లో పెట్టేశారట సల్మాన్ . అపూర్వ లఖియా చెప్పిన ఆర్మీ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 'ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ త్రీ' అనే నవల ఆధారంగా అపూర్వ లఖియా స్క్రిప్ట్ చేశారని టాక్.

వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఈ సారి తార్ మార్ టక్కర్ మార్ అనడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 70 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో సల్మాన్‌తో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోలు కూడా కనిపించనున్నారు. లడఖ్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికిందర్ ఫ్లాప్‌ని మర్చిపోవాలంటే ఇమీడియేట్‌గా సెట్స్ కి వెళ్లాలనుకుంటున్నారట సల్మాన్.

అపూర్వ లఖియా సినిమా రెండు రాత్రుల్లో జరిగిన కథ. గల్వాన్ లోయలో అక్టోబర్ వరకు షూటింగ్ సాగుతుంది. కొంత భాగాన్ని ముంబైలో సెట్స్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ తర్వాత కబీర్‌ఖాన్ సినిమా లో నటిస్తారు సల్మాన్. అయితే అది భజరంగీ భాయిజానా? కాదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.




