- Telugu News Photo Gallery Cinema photos Shah rukh khan rani mukherjee new movie may come soon know the details here
మళ్ళీ తెరపై కనిపించనున్న హిట్ కాంబో.. మళ్ళీ బాలీవుడ్‌ను రూల్ చేయనున్నారా ??
కొంతమంది సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు చప్పట్లతోనూ, విజిల్స్ తోనూ మారుమోగిపోతాయి. అలాంటి జోడీ ఇప్పుడు ఇంకోసారి స్క్రీన్ మీదకు రాబోతోంది. అది కూడా కింగ్ సైజ్‌లో. బాలీవుడ్ కింగ్ మూవీతో... కింగ్ అనగానే షారుఖ్ గుర్తుకొచ్చేశారు కదా.. మరి క్వీన్ ఎవరనుకుంటున్నారా? చూసేద్దాం పదండి.
Updated on: May 20, 2025 | 3:22 PM

కొంతమంది సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు చప్పట్లతోనూ, విజిల్స్ తోనూ మారుమోగిపోతాయి. అలాంటి జోడీ ఇప్పుడు ఇంకోసారి స్క్రీన్ మీదకు రాబోతోంది. అది కూడా కింగ్ సైజ్‌లో. బాలీవుడ్ కింగ్ మూవీతో... కింగ్ అనగానే షారుఖ్ గుర్తుకొచ్చేశారు కదా.. మరి క్వీన్ ఎవరనుకుంటున్నారా? చూసేద్దాం పదండి.

షారుఖ్ పక్కన్న రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నారంటూ బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. యస్.. అదీ కింగ్ సినిమాలో. షారుఖ్ భార్యగా నటించడానికి ఓకే చెప్పేశారట రాణీ ముఖర్జీ.

రీసెంట్‌గా సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట రాణి. షారుఖ్ - రాణి అనగానే వింటేజ్ సీన్స్, సాంగ్స్, షాట్స్ గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

వాళ్లిద్దరూ చేసిన గత సినిమాల నుంచి.. కింగ్‌లో రెఫరెన్సులు ఏమైనా ఉంటాయా? అనే డిస్కషన్ కూడా షురూ అయింది. షారుఖ్‌కి భార్యగా, ఆయన తనయ సుహానాకి తల్లిగా నటిస్తారు రాణీ ముఖర్జీ. ఆల్రెడీ దీపిక కూడా ఈ ప్రాజెక్టుకు సైన్ చేశారు.

సో, షారుఖ్ డబుల్ షేడ్స్ లో కనిపిస్తారా? యంగ్ షారుఖ్‌తో దీపిక జోడీ కడతారా? లేకుంటే దీపిక మరేదైనా కీ రోల్ చేస్తారా అనే డిస్కషన్ కూడా షురూ అయింది ముంబై మీడియాలో.