- Telugu News Photo Gallery Cinema photos Is Maniratnam going to make a film in Telugu again after 36 years?
Maniratnam: 36 ఏళ్ళ తర్వాత మళ్లీ తెలుగులో మణిరత్నం సినిమా.. అదెప్పుడు మొదలు.?
36 ఏళ్ళ తర్వాత మణిరత్నం తెలుగు సినిమా చేయబోతున్నారా..? గీతాంజలి తర్వాత టాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా.. సింపుల్‌గా నో చెప్పిన మణి సార్ ఇన్నాళ్లకు తెలుగు సినిమాకే ఓకే చెప్పారా..? మరి ఈయన ఏ హీరోతో పని చేయబోతున్నారు..? మణిరత్నం రీ ఎంట్రీ సినిమాలో హీరో ఎవరు..? అదెప్పుడు మొదలు కాబోతుంది..?
Updated on: May 20, 2025 | 3:37 PM

మణిరత్నం ఇన్నేళ్ళ కెరీర్‌లో ఒకే ఒక్క తెలుగు సినిమా చేసారు. 1989లో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు మణి. ఆయన డబ్బింగ్ సినిమాలే తెలుగులో మ్యాజిక్ చేసాయి. గీతాంజలి తర్వాత ఎంతోమంది హీరోలు ఆఫర్ ఇచ్చినా.. ఆయన మాత్రం హిందీ, తమిళంకే పరిమితమయ్యారు.

పొన్నియన్ సెల్వన్‌తో ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. కమల్ హాసన్‌తో నాయకుడు తర్వాత మణి చేస్తున్న సినిమా ఇది.

ఇందులో కోలీవుడ్ స్టార్ శింబు మరో హీరోగా నటిస్తున్నారు.. గ్యాంగ్ స్టర్ డ్రామాగా థగ్ లైఫ్ వస్తుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఓ తెలుగు హీరోతో పని చేయబోతున్నారు మణిరత్నం.

జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టితో మణిరత్నం ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. 36 ఏళ్ళ తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది.

నాని లాంటి హీరోలు జీవితకాలంగా మణిరత్నంతో పని చేయాలని చూస్తున్నారు.. అలా చూస్తే నవీన్ పొలిశెట్టికి ఇది బంపర్ ఆఫరే. మరి చూడాలిక.. ఇది ఎంతవరుకు నిజం అవుతుందో.? ఏం జరగబోతుందో..?




