Kiara Advani: ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నానంటున్న కియారా
ఇంకా మర్చిపోలేకపోతున్నానంటూ కియారా పోస్టు పెడితే.. సేమ్ టు సేమ్ మా పరిస్థితి కూడా అలాగే ఉందని రిప్లైలు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ కియారా ఏ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నట్టు... జనాలు దేనికి జేజేలు కొడుతున్నట్టు చూసేద్దాం పదండి.. జరగండి జరగండి అని కియారా డైరక్ట్ గా అనలేదు కానీ, మెట్ గాలాలో పరిస్థితి మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే అనిపించింది.
Updated on: May 20, 2025 | 8:30 PM

జరగండి జరగండి అని కియారా డైరక్ట్ గా అనలేదు కానీ, మెట్ గాలాలో పరిస్థితి మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే అనిపించింది. మెట్ గాలా స్టెప్స్ మీద కియారా యమా స్టైలిష్‌గా ఇచ్చిన ఫోజుల్ని మర్చిపోలేకపోతున్నారు జనాలు.

నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ సిట్చువేషన్‌లోనే ఉన్నా. మీ ప్రేమాభిమానాల్లో మునిగి ఇంకా తేలడం లేదంటూ మెట్‌గాలా ఈవెంట్‌ని గుర్తుచేసుకున్నారు కియారా.

ఈ ఏడాది గేమ్ చేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లేడీ ఆగస్టులో వార్2లో పలకరించడానికి రెడీ అవుతున్నారు. బేబీ బంప్‌తో దీపిక కల్కి ప్రమోషన్లలో పాల్గొన్నట్టు, కియారా వార్2 ప్రమోషన్లకు హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఓ వైపు సినిమాలు, మరోవైపు ప్రెగ్నెన్సీని పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకున్నారు కియారా. ఈ ఏడాది ఒకటికి రెండు రిలీజులున్నాయి. వచ్చే ఏడాది ఎలాగూ టాక్సిక్ ప్రేక్షకులను పలకరిస్తుంది.

2027కి ఆఫ్టర్ డెలివరీ ఫిట్‌గా తయారయ్యి ఏదో ఒక సినిమా చేసేయొచ్చు. ప్రెగ్నెంట్ అయినా.. కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా బాగానే జాగ్రత్త పడ్డారు ఈ లేడీ అని మెచ్చుకుంటున్నారు జనాలు.




